అన్నంత పనిచేసిన ట్రంప్.. 'GETTR' పేరిట సొంత సోషల్ మీడియా, అచ్చం ట్విట్టర్ లాగే..!!

సోషల్ మీడియాలో చురుగ్గా వుండే డొనాల్డ్ ట్రంప్‌కు అవి చేతిలో లేకపోవడం పెద్ద లోటుగానే వుంది.అధికారంలో వున్నప్పుడు ప్రతి విషయాన్ని ఈ మాధ్యమాల సాయంతో ప్రజలతో పంచుకునేవారు ట్రంప్.

 Trump Team Quietly Launches Twitter Like Social Media Platform Called Gettr-TeluguStop.com

కానీ ఎప్పుడైతే క్యాపిటల్ భవనంపై దాడి జరిగిందో నాటి నుంచి సోషల్ మీడియా దిగ్గజాలు ఆయనపై బ్యాన్ వేశాయి.ట్విట్టర్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం విధించగా.

ఫేస్‌బుక్ 2023 వరకు బ్యాన్ వేసింది.దీంతో నాటి నుంచి ట్రంప్‌ చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ మెయిల్స్‌, బ్లాగ్ సహా కొన్ని ఫ్లాట్ ఫామ్‌లతో కొద్దిరోజులు నెట్టుకొచ్చినా.అది అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు.

తాజాగా ప్రముఖ వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫాం రంబుల్‌లో డొనాల్డ్ ట్రంప్ చేరారు.అయితే ఇది కూడా ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే టాక్ వినిపిస్తోంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై కోపంతో తానే సొంతంగా సోషల్ మీడియా యాప్‌ను తీసుకొస్తానని గతంలోనే ఆయన ప్రకటించాడు.ఇప్పుడు ట్రంప్ అన్నంత పనిచేశాడు.

ఫేస్‌బుక్, ట్విటర్‌కు పోటీగా ‘GETTR‘ పేరిట కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చారు.టీమ్ డొనాల్డ్ ట్రంప్ గురువారం ‘GETTR’ను వైభవంగా లాంచ్ చేసింది.

ఈ విషయాన్ని ‘POLITICO‘ ట్విటర్ ద్వారా తెలియజేసింది.దీంతో ట్రంప్ మద్ధతుదారులు, రిపబ్లికన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాదిరిగా కాకుండా భావ ప్రకటనకు ‘GETTR’లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని టీమ్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించింది.

Telugu American, Donald Trump, Gettr, Jason Miller, Politico-Telugu NRI

ట్రంప్ మాజీ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లెర్ ఈ యాప్ వెనుక కీలకపాత్ర పోషించారు.ట్విట్టర్ తరహా ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి ఆయన తన పదవి నుంచి తప్పుకున్నట్లు అమెరికన్ మీడియా బుధవారం రాత్రి నివేదించింది.ఈ మేరకు మిల్లెర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఇక ‘GETTR’ విషయానికి వస్తే.ఇతర గెట్టర్ ఇట్స్‌తో సంభాషించడానికి, వార్తా కథనాలు, ఫోటోలు, వీడియోలను ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు.యాపిల్ ప్లే స్టోర్‌లో 1000 కంటే ఎక్కువ రేటింగ్‌లను పొందిన గెట్టర్‌కు సగటున 4.9 రేటింగ్‌తో ప్రశంసలు దక్కాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube