1871 నాటి చట్టాన్ని బయటకు తీసిన డెమొక్రాట్లు.. ట్రంప్‌‌‌‌‌కు ఇక చిక్కులేనా...?

క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్ధతు దారులు చేసిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న డెమొక్రాట్లు.మాజీ అధ్యక్షుడిని ఇప్పట్లో వదిలి పెట్టేలా కనిపించడం లేదు.

 Trump Sued For Us Capitol Attack Under 19th Century Ku Klux Klan Act, Trump, Dem-TeluguStop.com

దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయిన ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్‌కు శిక్ష పడాలని అధికార పక్షం భావిస్తోంది.దీనికి సంబంధించి ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిని నెగ్గించేందుకు డెమొక్రాట్లు శతవిధలా ప్రయత్నించారు.

సెనేట్‌లో వెంట్రుక వాసిలో ట్రంప్ తప్పించుకోవడంతంతో వారు కాస్త నిరాశకు గురయ్యారు.కానీ న్యాయశాస్త్రాలను డెమొక్రాట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారికి దొరికిన అస్త్రమే ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టం.ఈ ‘కూ క్లుక్స్‌ క్లాన్’ లేదా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌‌’ చట్టం ఆఫ్రికన్‌ అమెరికన్ల ఓటు హక్కులకు రక్షణ కల్పించేలా ఆ దేశ అధ్యక్షుడికి అధికారాలు కల్పిస్తూ.1871 సివిల్‌ వార్‌ సమయంలో ఏర్పడింది.దీని ద్వారా ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని డెమొక్రాట్లు సిద్ధమయ్యారు.

దీనిలో భాగంగా.జనవరి 6న క్యాపిటల్‌ బిల్డింగ్‌పై దాడిని ప్రోత్సహించడం ద్వారా మాజీ అధ్యక్షుడు ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టాన్ని ఉల్లంఘించారంటూ డెమోక్రటిక్‌ నేత బిన్నీ థాంప్సన్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

ట్రంప్‌తో పాటు, ఆయన న్యాయవాది రూడి గిల్యానీ సహా వారి మద్దతుదారులూ చట్టాన్ని ఉల్లంఘించారని థాంప్సన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.ట్రంప్‌, గిల్యానీ సహా రెండు ఇతర గ్రూపులు హింసాత్మక అల్లర్లతో కాంగ్రెస్‌ సభ్యులకు తీవ్రమైన ముప్పును కలిగించాయని థాంప్సన్‌ ఆరోపించారు.

అంతకుముందు క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ను సెనేట్‌ నిర్ధోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.వంద మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు వ్యతిరేకంగా 57 మంది ఓటువేయగా అనుకూలంగా 43 ఓటు వేశారు.

దీంతో శిక్షకు అవసరమైన మూడింట రెండు వంతుల కంటే పది ఓట్లు తక్కువ రావడంతో అభిశంసన తీర్మానం వీగిపోయింది.ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు ట్రంప్‌ను అభిశంసించేందుకు ఓటు వేసినా.

చివరకు అవసరమైన 67 ఓట్లు రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube