ట్రంప్ ఎకౌంటు వివరాలు చెప్పాల్సిందే...!!!  

Trump Submit Ur Account Details Us District Court Order-nri,telugu Nri News Updates,trump,trump Account Details

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి స్థానిక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అమత్ మెహతా కీలక ఆదేశాలు జారీ చేశారు.ట్రంప్ అధికారాన్ని చేపట్టక ముందు నుంచీ 8 సంవత్సరాల వరకూ గల తన ఎకౌంటు వివరాలని ఇవ్వాలని డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ ఆదేశించారు.ఈ మేరకు ట్రంప్ తరుపున ఎకౌంట్ చూసుకునే మాజర్స్ యూఎస్ఏ ఎల్ ఎల్ పీని ఆదేశించారు.

Trump Submit Ur Account Details Us District Court Order-nri,telugu Nri News Updates,trump,trump Account Details-Trump Submit Ur Account Details Us District Court Order-Nri Telugu Nri News Updates Trump

ఇదిలాఉంటే

Trump Submit Ur Account Details Us District Court Order-nri,telugu Nri News Updates,trump,trump Account Details-Trump Submit Ur Account Details Us District Court Order-Nri Telugu Nri News Updates Trump

తమకి ట్రంప్ కి సంభందించిన 8 సంవత్సరాల ఫైనాన్సియల్ రిపోర్ట్ ని ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రతినిధుల సభకి చెందిన హౌస్ ఓవర్ సైట్ and రిఫార్మ్స్ కమిటీ డిమాండ్ ని సవాలు చేస్తూ ట్రంప్ తరుపు న్యాయవాదులు చేసిన ఫిర్యాదులని పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.అయితే ఆర్ధిక పరిశీలనకి సంభందించి కాంగ్రెస్ అధికారాలు పరిమితిగా ఉంటాయని చట్ట ప్రకారం విచారణ జరిగేంత వరకూ కూడా ఈ పరిమితులు కాంగ్రెస్ విచారణని సైతం అడ్డుకోలేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ కి రికార్డ్ లు మాజర్స్ ఇవ్వకుండా ట్రంప్ అడ్డుకోలేరని న్యాయమూర్తి స్పష్టం చేశారు.న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పుపై మాజర్స్ కి చెందిన ఓ ప్రతినిధి స్పందిస్తూ చట్టప్రకారం మేము నడుచుకుంటామని, ఎటువంటి ఆదేశాలు కోర్టు ఇచ్చినా గౌరవించి సహకరిస్తామని తెలిపారు.