ఎంతకైనా తెగిస్తా....ట్రంప్ మరో హెచ్చరిక...!!!  

Trump Strong On Shutdown In America-new Nri Updates,nri,telugu Nri News Updates,trump,trump About Shutdown

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. సరిహద్దు గోడ విషయంలో అంగుళం కూడా వెనక్కి తెగ్గేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఏది ఏమైనా సరే సరిహద్దు గోడ కట్టాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న భాధలు డెమొక్రాట్ల పాపమే అంటూ వ్యాఖ్యానించారు.

Trump Strong On Shutdown In America-New Nri Updates Nri Telugu News Trump About

Trump Strong On Shutdown In America

సరిహద్దు విషయంలో ఎంతటి మూల్యాన్ని అయిన చెల్లించడానికి సిద్దంగా ఉన్నానని , 3,200 కిలోమీటర్ల పొడవునా పెద్ద గోడ నిర్మించాలన్న దానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ మంగళవారం తన కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలంటే దక్షిణ సరిహద్దుల్లో గోడ కట్టాల్సిందేనన్నారు.

అక్రమంగా వలసలు వచ్చిన వారి వలన అమెరికన్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వనరులు, ఉద్యోగాలు, వేతనాలు అన్నీ వీళ్లే అనుభవించడం సమంజసం కాదని అమెరికన్ పౌరులు తప్పకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే ఖచ్చితమైన ఫలాలు పొందాలని అన్నారు. గోడ కట్టడం వలన వంద కోట్ల డాలర్ల డ్రగ్స్ అక్రమ రవాణా ఆగిపోతుందని అన్నారు.