మొదలైన...ట్రంప్ ప్రచారం..!!!  

Trump Start Campaigning For Elections-

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.అక్కడ జరుగనున్న సాధారణ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఇచ్చిన సవాల్ ని ఎదుర్కునేందుకు గాను ఆయన ప్రచారం చేపట్టారని అంటున్నారు.గత కొన్ని వారాలుగా ప్రచారం చేయబోయే కార్యక్రమాలపై దృష్టి పెడుతూ పార్టీలో మార్పులు తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

Trump Start Campaigning For Elections--Trump Start Campaigning For Elections-

ప్రత్యర్ధి పార్టీలని పోటీలో ఓడించడానికి ట్రంప్ ఇప్పటికే వ్యూహరచన సైతం సిద్దం చేశారని అంటున్నారు.గతంలో డెమోక్రటిక్ పార్టీని ఓడించి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు.కానీ జిఓపి విషయంలో పూర్తిగా అధిపత్యాన్ని చేపట్టలేకపోయారు.తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల ప్రచారంలో బలహీనపడటంతో మాజీ అధ్యక్షుడు జార్జిహెచ్‌డబ్ల్యు బుష్‌, జిమ్మి కార్టర్లు ఓడిపోయారు,.

అయితే ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఉండకుండా ఉండేందుకు ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.2020 ఆగస్టులో జరిగే సాధారణ ఎన్నికలలో ప్రతిపక్షాలని ఓడించేందుకు ట్రంప్ అందరిని తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.