కరోనా రెస్పాన్స్ చట్టం... అమెరికాలో ఉద్యోగులకి భారీ ఊరట

కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటికే 200 మంది పైగా మృతిచెందగా సుమారు 14 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ కారణంగా అమెరికాలో ప్రజలు ఎవరు బయటకు రావద్దంటూ ఇంటికే పరిమితం అవ్వలని సూచనలు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం.ఉద్యోగులకు కాలేజీలకు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కరోనా రెస్పాన్స్ చట్టాన్ని తీసుకువచ్చింది

 Trump Signs Coronavirus Relief Legislation Into Law-TeluguStop.com

ఉచితంగా కరోనా పరీక్షలు, బాధిత ఉద్యోగులకు వేతనాలు తో కూడిన సెలవులు భీమా సౌకర్యం సౌకర్యాలను కల్పించడానికి ఈ చట్టాన్ని తీసుకు వచ్చినట్లుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

అంతేకాదు ఈ చట్టానికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.ఫ్యామిలీ ఫస్ట్ కరోనా వైరస్ రెస్పాన్స్ యాక్ట్ గా పిలిచే ఈ చట్టం ప్రతినిధి సభలో పాస్ అయింది.ఈ చట్టం ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి సుమారు రూ 7.5 లక్షల కోట్లు కేటాయించనున్నారు.

ఈ చట్టం వలన ఎంతో మంది పౌరులకి ఆర్ధికంగా తోడ్పాటు అందుతుందని తెలిపింది అమెరికా ప్రభుత్వం.ఈ కరోనా రెస్పాన్స్ చట్టం తో అమెరికా సిటిజన్స్ పెద్దలకు $ 1,000 మరియు పిల్లలకి $500 వచ్చే మూడు వారాలలో బ్యాంకు లో అమెరికా ప్రభుత్వం డైరెక్ట్ డిపాజిట్ చేయబోతున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది.

ఇదిలాఉంటే అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని ఎప్పటికప్పుడు భారతీయుల విద్యార్థుల యొక్క ఆరోగ్య సమాచారాన్ని అందించాలని అమెరికా ప్రభుత్వాన్ని భారత రాయబార కార్యాలయం కోరింది.అమెరికా వ్యాప్తంగా సుమారు రెండు లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉండటం గమనార్హం.

Coronavirus relief Trump signs legislation into law

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube