వలసవాసులపై ట్రంప్ సంచలన నిర్ణయం..!!!  

Trump Shocking Decision On Immigrants-corner Cities,decision,democratic Party,immigrants,shocking,telugu Nri Updates,trump

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసవాసులని ఇక నుంచీ అభయారణ్య ప్రాంతంగా పిలువబడే శాంక్చువరీ సిటీస్‌ కి తరలించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే వలసవాసులని ఈ అభయారణ్య ప్రాంతాలకి పంపాలని ట్రంప్ చేస్తున్న చర్యలు డెమోక్రాటిక్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే అంటున్నారు పరిశీలకులు..

వలసవాసులపై ట్రంప్ సంచలన నిర్ణయం..!!!-Trump Shocking Decision On Immigrants

వలసవాసులని దేశంలోకి అనుమతించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కలిపించడం ద్వారా దేశంలో స్థిరపడే అవకాశం ఇవ్వచ్చు అనేది డెమొక్రాట్ల వాదన. అయితే అందుకు వీలు లేకుండా వేలాది మంది వలసవాసులను నగరాల్లోకి అనుమతించటంతో పాటు వారిని తిప్పి పంపేందుకు ఫెడరల్‌ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం లేకుండా ట్రంప్‌ ఈ విచిత్ర ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

ఈ శాంక్చువరీ సిటీస్‌ ప్రాంతంలో లో వలసవాసుల జీవన పరిస్థితి చాలా దుర్భరంగా వుంటుందనేది అందరికి తెలిసిందే. అయితే అమెరికన్ సంతతి ప్రజల కన్నా వలసవాసులు అధికంగా నేరాలకి పాల్పడే అవకాశాలు తక్కువేనని ఇలాంటి పరిస్థితిలో వారికి ఈ ప్రాంతమే మంచిదని శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ జార్జ్‌ గాస్కన్‌ చెబుతున్నారు.