“భారత ఎన్నారై” విద్యార్ధులకి “ట్రంప్ షాక్’’     2018-05-18   00:47:25  IST  Bhanu C

భారత్ పై ట్రంప్ ఎదో ఒకరూపంలో కక్ష సాదిస్తున్నాడు..నిన్నా మొన్నటి వరకూ హెచ్ -1బీ , హెచ్ -4 వీసాలపై ట్రంప్ విధించిన ఆంక్షల వేడి ఇంకా చల్లారలేదు..తమ దేశ పౌరులకి ఉద్యోగాల కల్పన కోసం ట్రంప్ విధించిన షరతులు ఆ దేశ వ్యాపార సంభంద సంస్థలకే విసుగు తెప్పించాయి..ఎంతో మంది ఈ విధానాలని వ్యతిరేకించారు కూడా అయినా ట్రంప్ మాత్రం తన నిర్ణయం వెనక్కి తీసుకోలేదు

అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న మరొక నిర్ణయం భారతీయ విద్యార్ధులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. వివరాలలోకి వెళ్తే..వీసా గడువు ముగిసినా అమెరికాను వీడని విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకునేలా వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవలే ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది…ఈ కొత్త విధానం ఆగస్టు 9 నుంచి అమల్లోకి రానుంది.