బాహుబలిగా మారిన ట్రంప్.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న పోస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.తాజాగా భారత్ పర్యటనలో భాగంగా ట్రంప్‌ కోసం మోడీ చేస్తున్న ఏర్పాట్ల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

 Trump Shares Baahubali Meme-TeluguStop.com

కాగా భారత్ పర్యటనపై ట్రంప్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఇండియా టూర్ గురించి ట్రంప్ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన క్రమంలో పలు సోషల్ మీడియా పేజీలు అనేక మీమ్స్ క్రియేట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నాయి.

కాగా తాజాగా ఓ మీమ్ ఎంత వైరల్ అయ్యిందంటే, దాన్ని స్వయంగా ట్రంప్ కూడా ట్వీట్ చేసాడు.ఈ మీమ్‌లో బాహుబలి చిత్రంలోని పాటకు సంబంధించిన ఓ వీడియో పార్ట్‌లో ప్రభాస్ స్థానంలో ట్రంప్ తలను అతికించారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో తనకు భారత ప్రజలు చూపించే ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలిపాడు ట్రంప్.

ఇక అమెరికా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తోంది.మరి ఈ పర్యటనలో భాగంగా భారత్-అమెరికా దేశాలు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాయో చూడాలి అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube