ప్రతిభ ఉంటేనే 'అమెరికా' లో ఎంట్రీ..తేల్చి చెప్పిన ట్రంప్  

Trump Says To Come Only Talented Nri In Us-

అమెరికాకి వెళ్తున్న విదేశీయులపై ఆంక్షల విషయంలో కానీ వారి అమెరికా వెళ్ళాలనే కోరిక విషయంలో కాని ట్రంప్ ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పేశాడు.ప్రతిభ ఉన్నవారికే అమెరికాలో పట్టం కడతామని అందులో మరొక ఆలోచన ఏమి లేదని ట్రంప్ ఖరాఖండిగా చెప్పేశాడు..

ప్రతిభ ఉంటేనే 'అమెరికా' లో ఎంట్రీ..తేల్చి చెప్పిన ట్రంప్-Trump Says To Come Only Talented NRI In US

అంతేకాదు అలా చేస్తేనే భారత్ వంటి దేశాల్లోని ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందని అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు…

మీడియాతో మాట్లాడిన ట్రంప్ సరిహద్దుల విషయంలో రాజీ పడను అయితే ఈ విషయంలో నేను చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని , విదేశీయులు చట్టబద్ధంగా మాత్రమే అమెరికాలో ప్రవేశించాలి అలాగే వారు ఎంతో ప్రతిభతో రావాలి అంటూ కండిషన్స్ పెట్టారు.అమెరికాకి రావాలని ఇక్కడ స్థిరపడాలని ఎంతో మంది కోరుకుంటారు కానీ వారికి ఆ యోగ్యత ఉండాలని ట్రంప్ తెలిపారు అయితే .

అమెరికాకి త్వరలో అనేక కార్ల కంపెనీలు మరెన్నో కంపెనీలు వస్తున్నాయి ఆ సమయంలో విదేశీయుల అవసరం ఎంతో ఉంది అయితే ప్రతిభ కలవారు మాత్రమే ఇక్కడకి రావాలి అని చెప్పాడు.మాకు సాయం చేయగలిగే వారు మాత్రమే కావాలని అందుకు తగ్గట్టుగానే సరైన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు కూడా తెలిపానని ట్రంప్ స్పష్టం చేశాడు.