ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్టేనా..??  

Trump Political Career America - Telugu Americans, Donald Trump, Donald Trump Ruling, George Floyd, Nri News

అగ్ర రాజ్యం అమెరికాకి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ట్రంప్ కి లేవా.? ట్రంప్ పాలనపై అమెరికా ప్రజలతో పాటు ప్రతిపక్ష, స్వపక్ష పార్టీలు అలాగే ప్రభుత్వ అధికారులు.ప్రజలు.విసుగు చెందారా.?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ట్రంప్ గత కొంత కాలంగా పాలనపై పట్టు కోల్పోయారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో సైతం ట్రంప్ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం, భాద్యతా రాహిత్యంగా ఉండటం అమెరికా ప్రజలకి రుచించడం లేదని తెలుస్తోంది.

 Trump Political Career America

అధ్యక్షుడిగా ట్రంప్ ప్రతీ అంశంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారని.కరోనా విషయంలో ముందుగానే హెచ్చరించి ఉంటే లక్షలాది మంది అమెరికన్స్ ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని.కనీస వైద్యం అందించడంలో సైతం ట్రంప్ ఫెయిల్ అయిన మాట వాస్తవమేనని అంటున్నారు.ఇదిలాఉంటే.

అధికారులని ఇష్టం వచ్చినట్లు విధుల నుంచీ తప్పించడం.మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకపోగా జర్నలిస్టులపై భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించడం.అమెరికా వ్యాప్తంగా భారీగా నిరుద్యోగ సమస్యలు పెరిగిపోవడంతో పాటు ఆకలితోనే ప్రజలు అల్లాడి పోవడం ఇవన్నీ ట్రంప్ కుర్చీ కింద పిన్ తీసిన బాంబు లాంటివేనని అంటున్నారు పరిశీలకులు.అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం అట్టుడుకుతున్న సమస్య జార్జ్ ఫ్లాయిడ్ హత్య అంశం.

ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్టేనా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ విషయంలో ట్రంప్ వైఖరి పై ప్రపంచం మొత్తం మండిపడుతోంది.అమెరికాలో మెజారిటీ ప్రజలు ట్రంప్ ని తీవ్రంగా జార్జ్ హత్య విషయంలో వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఒక అధ్యక్షుడిగా ట్రంప్ జార్జ్ విషయంలో కానీ నిరసనలు తెలుపుతున్న అమెరికా ప్రజల విషయంలో వ్యవహరించలేదని అంటున్నారు.చివరికి సొంత పార్టీ కీలక సీనియర్ నేత మాజీ అధ్యఖ్సుడు బుష్ సైతం ట్రంప్ పై వ్యంగ్యంగా విమర్శలు చేయడంతో ట్రంప్ పై ప్రజలు నిరాసక్తికి వచ్చేశారని.

రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు సైతం ట్రంప్ వైఖరిపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని అంటున్నారు.ఇన్ని గొడవలు జరుగుతుంటే బంకర్ లో తల దాచుకోవడం, అసందర్భంగా మాట్లాడటం.భాద్యతా రాదిత్యమైన వ్యాఖ్యలు చేయడం ట్రంప్ ని మళ్ళీ అద్యక్ష పీటంపై కూర్చే బెట్టేలా లేవని, ఇక ట్రంప్ రాజకీయ భవిష్యత్తు గాలిలో కలిసిపోవాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test