కమలా హారీస్ పై భారీ కుట్ర...!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల హీట్ రోజు రోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది.భారత అలాగే ఆఫికన్ మూలాలు ఉన్న కమలా హారీస్ ని ఉపాధ్యక్ష పదవికి బిడెన్ ఎంపిక చేయడంతో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.

 Donald Trump Party Trying To Suspend Kamala Harris,america, Elections, Donald Tr-TeluguStop.com

కమలా హారీస్ నియామకంపై ఉలిక్కిపడిన ట్రంప్ ఆయన వర్గం ఇప్పుడు కమలా హారీస్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.అసలు కమలా హారిస్ ఎంపిక చట్టవిరుద్ధం అంటూ రిపబ్లికన్ పార్టీ , ట్రంప్ వర్గం ముప్పెడ దాటి చేస్తున్నాయి.

కమలా హారీస్ పై అనర్హత వేటు వేసేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కమలా హరీస్ ఎంపికతో గెలుపు విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్న డెమోక్రటిక్ పార్టీకి ప్రస్తుతం గెలుపుపై పూర్తి స్థాయి ధీమా వచ్చేసింది.

ఇదే విషయంపై ట్రంప్ కూడా ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే అసలు కమలా హరీస్ అమెరికాలోనే పుట్టలేదని, ఆమెని ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం చట్టవిరుద్దమని ప్రచారం మొదలు పెట్టారు.

ఓ ఉన్నతమైన న్యాయవాది కమలా హరీస్ ఎంపిక చట్టవిరుద్దమని అన్నారు కానీ డెమోక్రాట్లు కనీసం ఈ విషయం తెలుసుకోక పోవడం దారుణమని ఈ విషయంపై మా పార్టీ పరిశీలిస్తోందని ట్రంప్ ప్రకటించారు.

Telugu America, Democratic, Donald Trump, Donaldtrump, Joe Biden, Kamala Harris,

అయితే ట్రంప్ చేసిన ఆరోపణలని డెమోక్రటిక్ పార్టీ ఖండించింది.బిడెన్ వర్గంలో అత్యంత కీలకంగా ఉంటూ జాతీయ ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్న అజయ్ భుటోరియా సైతం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు.ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులని చేపట్టేవారు 1787 తరువాత అమెరికాలో పుట్టి ఉండాలి అని స్పష్టంగా ఉంది.

కమలా హారీస్ 1964 అక్టోబర్ 20 న కాలిఫోర్నియా లో జన్మించారని ఈ విషయం రిపబ్లికన్ పార్టీ నేతలకి ట్రంప్ కి తెలియకపోవడం విచారకరమని కౌంటర్ ఇచ్చారు.అయితే ట్రంప్ ఆమె అభ్యర్ధిత్వంపై మాట్లాడటం ఆయన ఓటమికి మరింత సహకరిస్తుందని కమలా హారీష్ విషయంలో ట్రంప్ వివాదాస్పన వ్యాఖ్యలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube