అన్నట్లుగానే WHO కు నిధులు నిలిపేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు.WHOకు నిధులు నిలిపివేస్తామంటూ ఆయన చెప్పినట్లుగానే నిధులను నిలిపివేసినట్లు తెలుస్తుంది.

 అన్నట్లుగానే Who కు నిధులు నిలి-TeluguStop.com

తమ దేశం తరపున ఆ సంస్థకు అందించే నిధులు అన్నిటిని కూడా నిలిపివేయమంటూ అధికారులను ఆదేశించారు.తొలినాళ్ల లో ఆ సంస్థకు కరోనా గురించి తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటూ ఇటీవల ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ సంస్థకు అగ్రరాజ్యం అందించే నిధులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

ఇప్పటికే అక్కడే వైరస్ బారిన పడి 26 వేలమందికి పైగా మృతి చెందగా, 6 లక్షల మందికి పైగా కరోనా తో బాధపడుతున్నారు.
దీంతో ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తమ దేశం నుంచి సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు.మరోవైపు కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

డబ్ల్యూహెచ్‌ఓ బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Telugu America, Coronavirus, Covid, Trump-

చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొన్న ‘అత్యంత వినాశకరమైన’ నిర్ణయమంటూ ట్రంప్ దూయ్యబట్టారు.అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్య ముప్పు తలెత్తినప్పుడు ప్రపంచ దేశాలూ సరైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్‌ఓపై ఆధారపడతాయని గుర్తుచేశారు.కానీ, ఆ సంస్థ మాత్రం ఈ కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందంటూ ట్రంప్ ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube