అసమర్ధుడు.. అధ్యక్షుడిగా అనర్హుడు, ఎప్పుడు దిగిపోతాడో: ట్రంప్‌పై బైడెన్ వ్యాఖ్యలు

అధ్యక్షుడిగా దిగిపోయే చివరి రోజుల్లో ట్రంప్ హుందాగా ప్రవర్తించాల్సింది పోయి చేజేతులా అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు.ఉన్న కాస్త పరువు కూడా క్యాపిటల్ బిల్డింగ్‌పైకి మద్ధతుదారులను ఉసిగల్పడంతో గంగలో కలిసిపోయింది.

 Trump One Of Most Incompetent Us Presidents: Joe Biden, Donald Trump, Inspiring-TeluguStop.com

నిన్న మొన్నటి వరకు ఆయనకు మద్ధతుగా నిలబడిన వారు సైతం ట్రంప్ చేష్టలతో విసిగిపోతున్నారు.ఇంటా బయటా విమర్శలు చుట్టుముట్టడంతో పాటు అభిశంసన ఎదుర్కోనే వరకు తెచ్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్.

ఈ నేపథ్యంలో కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కొద్దిరోజుల నుంచి ట్రంప్‌పై మాటలదాడికి దిగారు.ఇది అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మించి వుంటోంది.

తాజాగా అమెరికా చరిత్రలోనే ట్రంప్ అత్యంత అసమర్థ అధ్యక్షుడంటూ వ్యాఖ్యానించారు.అత్యున్నత పదవిలో కొనసాగేందుకు తగిన వ్యక్తి కాదంటూ బైడెన్ ఎద్దేవా చేశారు.అలాగే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను బైడెన్ స్వాగతించారు.ఆయన ఆ కార్యక్రమానికి రాకపోవడమే మంచిదన్న జో బైడెన్..ట్రంప్ దేశానికి ఇబ్బందికరంగా మారారని ఆరోపించారు.

Telugu Donald Trump, Joe Biden, Supporters, Mike Pence-Telugu NRI

ఇప్పుడు యావత్ దేశం ఆయన ఎప్పుడెప్పుడా దిగిపోతారా అని చూస్తున్నారని బైడెన్‌ అన్నారు.అభిశంసన అనేది పూర్తిగా కాంగ్రెస్‌కు సంబంధించిన విషయమన్న ఆయన… దీనిపై ఉభయసభలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటాయని బైడెన్ వెల్లడించారు.ఇదే సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురుచూస్తున్న వారిలో తాను కూడా ఒకడినని బైడెన్ స్పష్టం చేశారు.తన ప్రమాణ స్వీకారానికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను ఆహ్వానిస్తానని ఆయన వెల్లడించారు.

కాగా, జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్లో కొన‌సాగుతారు.ఆ రోజున జ‌రిగే ప్ర‌మాణ స్వీకారోత్స‌వంతో జో బైడెన్ పూర్తి స్థాయిలో అమెరికా 46వ అధ్య‌క్షుడిగా మారుతారు.

ట్రంప్ రాజీనామా చేయ‌కుంటే మేమే ఆయ‌న్ను అభిశంసిస్తామ‌ని హౌజ్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ వార్నింగ్ కూడా ఇచ్చారు.కానీ అధికారం నుంచి త‌ప్పుకోవ‌డానికి ట్రంప్‌కు ఇంకా 11 రోజులు మాత్ర‌మే ఉంది.

ఆలోగా ఆయ‌న అభిశంస‌న సాధ్య‌మే అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube