బైడెన్‌కు జైకొట్టిన అధ్యక్షుడి ‌ముఖ్య సలహాదారు: ట్రంప్ రీయాక్షన్ ఏంటో..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినా.అధికార బదలాయింపునకు ట్రంప్ ససేమిరా అంటున్న విషయం తెలిసిందే.

 Donald Trump Aide Comes Close To Recognizing Loss, Vows Smooth Transition, Donal-TeluguStop.com

అమెరికా దేశాధ్యక్షుల స్థాయిలో అధికార మార్పిడి ఒక్కరోజులో జరగదు.దీనికి కొంత సమయం తీసుకొంటుంది.

కొత్త అధ్యక్షుడు ఎన్నికైన దగ్గర నుంచి అధికార మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటూ వస్తారు.జనవరిలో ప్రమాణస్వీకారంతో ఈ ప్రక్రియ దాదాపు పూర్తవుతుంది.

ఇప్పుడు ట్రంప్‌ బృందం ఈ ప్రక్రియకు అంగీకరించడం లేదు.ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు.

Telugu America, Donald Trump, Joe Biden, Vows Smooth-Telugu NRI

అటార్నీ జనరల్‌ విలియం బార్‌.ఓటింగ్‌ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్‌ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు.ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌ ఒకవైపు పెంటగాన్‌ చీఫ్‌ను తప్పించారు.కరోనా కట్టడి కోసం బైడెన్‌ ఏర్పాటు చేయదలచుకున్న నిపుణుల బృందానికి ప్రభుత్వ విభాగాల ద్వారా ట్రంప్‌ నో చెప్పించారు.

Telugu America, Donald Trump, Joe Biden, Vows Smooth-Telugu NRI

ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలని పలువురు రిపబ్లికన్‌ సెనేటర్లు, మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ తదితరులు ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చినా ఫలితం శూన్యం.ఇదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీ ముఖ్యులు కొందరు ట్రంప్‌వైపే నిలబడ్డారు.పార్టీలో తనకు మద్దతుగా నిలవని వారిని పదవుల నుంచి తప్పించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇలాంటి పరిస్ధితుల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, అధ్యక్షుడి జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్.

జో బైడెన్‌కు జై కొట్టారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బైడెన్‌కు సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓబ్రియాన్ వెల్లడించారు.

గ్లోబల్‌ సెక్యూరిటీ ఫోరంలో ఓబ్రియాన్‌ మాట్లాడుతూ.అధ్యక్షుడు ట్రంప్‌ మరో నాలుగేళ్లు ఆ పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.అదే సమయంలో నూతనంగా ఎన్నికైన జో బైడెన్‌, కమలా హారిస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినా, వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఓబ్రియాన్ స్పష్టం చేశారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కాస్త కుదురుకొని వారి విధానాలను అమలు చేసేందుకు సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వమేదైనా ఇప్పుడు నిర్వర్తిస్తున్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఓబ్రియాన్ పేర్కొన్నారు.బైడెన్‌ కొత్తగా ఫ్రొఫెషనల్‌ నేషనల్‌ సెక్యూరిటీ టీంను సిద్ధం చేసుకునే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి ఏమైనా అనుమానాలుంటే డిసెంబరు 8 లోగా రుజువు చేయాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్‌ 14న విజేతను అధికారికంగా ప్రకటిస్తారు.

అయితే, అమెరికాలో ఒక రకంగా ఎన్నికల సమరం ముగిసిపోయినట్లేనని ఓబ్రియాన్‌ వ్యాఖ్యానించారు.గతంలోనూ శాంతియుత వాతావరణంలోనే అధికార మార్పిడి జరిగినట్లు ఆయన గుర్తు చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube