కరోనా ఎఫ్ఫెక్ట్ : రంగంలోకి దిగిన అమెరికా నేషనల్ గార్డ్ దళాలు...!!!  

Trump National Guard California Coronavirus Effect -

అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 553మంది చనిపోగా సుమారు 43,718 కేసులు నమోదు అయ్యాయి.దాంతో ట్రంప్ కరోనా బాధితులకి సాయం అందించే ప్రయత్నాలని ముమ్మరం చేశారు.

 Trump National Guard California Coronavirus Effect - -Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం మరిన్ని రాష్ట్రాలకి లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉన్న నేపధ్యంలో ట్రంప్ చైనాపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ప్రపంచాన్ని చైనా ముందే హెచ్చరించి ఉంటే ఈ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడేవారు కాదు ప్రాణాలు పోయేవి కావని మంది పడుతున్నారు.ఇదిలాఉంటే

కరోనా ఎఫ్ఫెక్ట్ : రంగంలోకి దిగిన అమెరికా నేషనల్ గార్డ్ దళాలు… - Trump National Guard California Coronavirus Effect - -Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికా వ్యాప్తంగా కరోనా ఉదృతం ఎక్కువగా ఉన్న న్యూయార్క్ , కాలిఫోర్నియా , వాషింగ్టన్ రాష్ట్రాలకి నేషనల్ గార్డ్ దళాలని పంపుతున్నట్టుగా ట్రంప్ తెలిపారు.

ఇందుకు సంభందించిన ఖర్చులు మొత్తాన్ని ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.ఈ విషయంపై మూడు రాష్ట్రాల గవర్నర్ లతో చర్చించానని వారు ఈ సదుపాయానికి సంతోషం వ్యక్తం చేశారని అన్నారు.
కరోనా బారిన పడకుండా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని స్వీయ నిర్భందం మాత్రమే కరోనాని కట్టడి చేయగలదని అందుకు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.ప్రజా ప్రతినిధులు , స్వచ్చంద సంస్థలు అమెరికా ప్రజలకి సేవలు చేయడం ఎంతో సంతోషమని కానీ వారు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలలోకి వెళ్ళడం మంచిదని సూచించారు.

ప్రజలు అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

Trump National Guard California Coronavirus Effect Related Telugu News,Photos/Pics,Images..