ట్రంప్ కి అమెరికా కోర్టు సూటి ప్రశ్న..  

Trump Is The Us Court\'s Straightforward Question-

ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటినుంచీ నేటి వరకూ కూడా భారతీయులని వేధిస్తున్న ఏకైక విధానం హెచ్ -1 బీ వీసా.ఈ విషయంలో ట్రంప్ ఇండియన్స్ కి వ్యతిరేకంగా ఉంటున్నాడని, భారతీయులని స్వదేశానికి పంపేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడనే అందరికి తెలిసిందే.

Trump Is The Us Court\'s Straightforward Question- Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)- Visa Immigration,Events,Organizations,Passpor-Trump Is The US Court's Straightforward Question-

అయితే అమెరికా డిస్ర్టిక్ట్‌ కోర్టు ఈ విధానంపై ట్రంప్ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.అంతేకాదు హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను పెద్దఎత్తున ఎందుకు తిరస్కరిస్తున్నారు, వాటిని ఇవ్వడంలో ఇంతటి జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వండి అంటూ కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం చేపడుతున్న ఈ తీరు ఐటీ సేవల కంపెనీల ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఉందని ఆయా సంస్థలు పెట్టుకున్న ఆర్జీలపై స్పందిచాలని ఆ ఉత్తర్వుల్లో కోరింది.ఈ వీసాలపై అమెరికాలో అడుగుపెట్టే వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటారు.

అయితే కోర్టు ఇచ్చిన ఈ తాజా ఉత్తర్వుతో భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.అమెరికాలోని ఐటీ కంపెనీల సమాఖ్య అయిన ఐటీ సర్వ్‌ అలియెన్స్‌ వేసిన పిటిషన్ ఆధారంగా చేసుకుని కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే

గత సంవత్సరం సెప్టెంబరు 30తో ముగిసిన ఆర్ధక సంవత్సరం నాటికి హెచ్ -1 బీ వీసాల తిరస్కరణ శాతం ఆర్థిక 20 నుంచి 80 శాతానికి అమాంతం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాయి కంపెనీలు.మరో 60 శాతం దరఖాస్తులను అదనపు సమాచారం కావాలనే పేరుతో పక్కన పెట్టారని, ఇలాంటి పరిణామాల వలన కంపెనీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంది.

మరి తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందోనని ఆత్రుతగా వేచి చూస్తున్నారు ఆశావాహులు.

తాజా వార్తలు

Trump Is The Us Court\'s Straightforward Question- Related....