సిగ్గుచేటు : ట్రంప్‌ వచ్చే వరకు ఇండియా ఎక్కడుందో వారికి తెలియదా?

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ దాదాపు రెండు రోజుల భారత పర్యటన నిన్నటితో ముగిసింది.అమెరికా అధ్యక్షుడు ఇండియాకు రావడంతో అంతర్జాతీయ మీడియా దృష్టి అంతా కూడా ఇండియాపైనే ఉంది.

 Trump India Visit And Americans Are Searching For Where Is India-TeluguStop.com

ఇండియాపై ఈ రెండు రోజులు అంతర్జాతీయ మీడియాలో వార్తలు మారు మ్రోగిపోయాయి.ఇప్పటి వరకు ఇండియా గురించి పెద్దగా తెలియని వారు అంతర్జాతీయ మీడియాలో ఇండియా గురించి వచ్చిన కథనాలు మరియు ఇతరత్ర వార్తలను చూసి ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా లక్షలాది మంది హాజరు అయిన ఆ మీటింగ్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.దాంతో ప్రపంచం అంతా కూడా ఈ విషయమై మాట్లాడుకోవడం జరుగుతుంది.

ప్రముఖులు ఎంతో మంది గతంలో ఇండియాను విజిట్‌ చేశారు.కాని అప్పట్లో మీడియా ఈ స్థాయిలో లేదు.

కనుక కొద్ది మందికే రీచ్‌ అయ్యింది.కాని ఇప్పుడు మీడియా చాలా బలంగా ఉంది.

అందుకే ట్రంప్‌ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.

Telugu Donaldtrump, India, Narendra Modia, Trumpindia, Tump India-Latest News -

ఇక కొన్ని దేశాలకు చెందిన వారికి కనీసం ఇండియా ఎక్కడ ఉంటుంది.అసలు ఇండియా అంటే ఏంటీ అనే విషయాలు కూడా తెలియదు.వారు నిన్న మొన్నటి అంతర్జాతీయ వార్తల నేపథ్యంలో గూగుల్‌లో ఇండియా గురించి తెగ వెదికేశారు.

ఇండియా కరెన్సీ ఏంటీ.ఇండియా తమ దేశానికి ఎటు వైపు ఉంది.

ఇండియా ప్రాముఖ్యత ఏంటీ.ఇక్కడ పరిపాలన విధానం ఏంటీ.

ఇండియా చరిత్ర ఏంటీ అనే విషయాలను నెటిజన్స్‌ తెగ గూగులింగ్‌ చేశారు.

Telugu Donaldtrump, India, Narendra Modia, Trumpindia, Tump India-Latest News -

ప్రస్తుతం ప్రపంచంలో అగ్రదేశాల సరసన భారత్‌ నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది.ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించడంతో పాటు చంద్రుడిపై కాలు మోపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది.అంతటి గొప్ప ఇండియా గురించి మొదటి సారి విన్నాం అంటూ చాలా మంది చెప్పడం విడ్డూరంగా ఉంది.

ఇన్నాళ్లు వారు ఇండియా గురించి తెలుసుకోక పోవడం వారి సిగ్గు చేటు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube