నోబెల్ లిస్ట్ లో ట్రంప్.. ఎలా అంటే..?!

డోనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది చైనా దేశంతో వాణిజ్య యుద్ధం, ఉత్తర కొరియా తో మాటల యుద్ధం.ఇలా ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదమే గుర్తొస్తుంది మన అందరికీ.

 How Donald Trump Nominated To Nobel Peace Prize, Trump, Nobel, Viral, Every Year-TeluguStop.com

అయితే, ఆయన పదవి కాలం మొత్తం ఏదోక వివాదంతోనే ముందుకు కొనసాగితే ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం కూడా అమెరికా దేశాన్ని మొత్తం  తలకిందులుగా చేసేసాడు.ఎన్నడూ లేని విధంగా అమెరికా దేశంలో ఆందోళనగా పరిస్థితులను సృష్టించాడు డోనాల్డ్ ట్రంప్.

ఇది ఇలా ఉండగా తాజాగా డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి ఇన్ని గొడవల మధ్య నామినేట్ అయ్యారు అంటే ఇంతకీ మీరు నమ్ముతారా.!? అవును ఇది నిజం.డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతికి నామినేట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.డోనాల్డ్ ట్రంప్ తో పాటు అమెరికన్ నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్), ఐక్యరాజసమితి శరణార్థుల క్యాంపులు, పలు దేశానికి చెందిన అనేక మంది నామినేట్ అయ్యారు.

నామినేషన్ లో భాగంగా ప్రముఖ ఆర్గనైజేషన్స్,  ప్రముఖ రాయిటర్స్ సర్వే ప్రకారం.పర్యావరణం కోసం నిత్యం పోరాడే స్వీడన్ కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ అనే ఆయన కాస్త ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.

Telugu Alexi Novelni, China, Corona Vaccine, Covax, Greta Thunberg, Nato, Nobel,

అనంతరం ఆయన తర్వాత రష్యాలో శాంతియుతంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడే అలెక్సీ నవల్ని ముందంజలో ఉన్నారు.వీరితో పాటు ప్రముఖ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ, కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రాములు తర్వాతి వరుసలో నిలిచాయి.ఈ నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో పూర్తి అవబోతుంది.ఇప్పటివరకు వీరిలో ఎవరికీ కూడా నోబెల్ కమిటీ ఆమోదం ఇవ్వలేదు.ఇదిలా ఉండగా మరోవైపు నామినేషన్లు అన్నీ కూడా పరిశీలన చేసిన అనంతరం అక్టోబర్ నాటికి విజేతలను ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube