హిందువులని మరిచావా ట్రంప్..!!!  

Trump In Celebrates Deepavali But Forgets Hindu Peoples-nri,telugu Nri News Updates,trump In Celebrates Deepavali

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సారి తన ప్రతిభని ట్విట్టర్ సాక్షిగా బయట పెట్టారు.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్వేతసౌధంలోని చారిత్రక రూజ్‌వెల్ట్ గదిలో బుధవారం దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు భారతీయ- అమెరికన్లు...

హిందువులని మరిచావా ట్రంప్..!!!-Trump In Celebrates Deepavali But Forgets Hindu Peoples

ఎంతో మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకి హాజరయ్యారు.ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది.

దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ మేము అందరం ఒక్క చోటుకి చేరుకున్నాము.అమెరికాతో పాటు ప్రపచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది బౌద్ధులు, సిక్కులు, జైనులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇందులో హిందువులను ట్రంప్ ప్రస్తావించలేదు. దీంతో నెటిజన్లు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు..