ఇక అలాంటి వారికే 'హెచ్‌-1బీ వీసా'  

Trump Implements New Policy For H1b Visa-

US President Trump believes that India is a very ally country and that's the reason that the words are waterless. The Donald Trump government is subduing the damaging measures. There are strategies for issuing more number of permits (visas) to foreigners who have mastered American universities or higher education institutions in the H-1B visas.

.

భారత్ తనకి ఎంతో మిత్ర దేశమని.తనకెంతో ఇష్టమైన దేశమని చెప్పే అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆ మాటలు ఒట్టి నీటి మూటలేనని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉన్నాడు..

ఇక అలాంటి వారికే 'హెచ్‌-1బీ వీసా'-Trump Implements New Policy For H1B Visa

హెచ్-1 బీ తో భారత్ పై పగపట్టిన ట్రంప్ పూర్తి స్థాయిలో భారత్ పై విషం కక్కుతున్నాడు.మెల్ల మెల్లగా అతడి చర్యలు భారత టెక్‌ కంపెనీలను పూర్తిగా దెబ్బతీసే చర్యలకు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఉపక్రమిస్తోంది.

ఇకపై హెచ్‌-1బీ వీసాల జారీలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో లేదా ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ చేసిన విదేశీయులకే ఎక్కువ సంఖ్యలో పర్మిట్లు (వీసాలు) ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటి వరకూ కూడా భారతీయ టెక్‌ కంపెనీలు ఎక్కువగా బ్యాచిలర్‌ కోర్సులు చేసిన టెక్‌ యువతకే ఉద్యోగావకాశాలు కల్పిస్తూ వారికే హెచ్‌-1బీ వీసాలను ప్రతిపాదించేవి…అయితే ఇక మాస్టర్స్‌ను తప్పనిసరి చేస్తూ బిల్లులో ప్రతిపాదన చేరిస్తే హెచ్‌-1బీ నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల సంఖ్య తగ్గుతుందని అప్పుడు అమెరికన్లకు ఆ ఉద్యోగాలు లభిస్తాయని ట్రంప్‌ ప్రభుత్వం విశ్వసిస్తోంది.

గతంలో మొదట మాస్టర్స్‌ చేసిన వారికి జారీ చేసే 20వేల వీసాల దరఖాస్తులను ప్రాసెస్‌ చేసి అందులో మిగిలిన వారిని 65,000 సాధారణ వీసాల సంచయంలో కలిపేవారు ఇకనుంచీ మొత్తం అందరినీ 65,000 వీసాల లిస్టులో కలిపేసి ఆ పరిమితి నిండాక ఎవరైనా మిగిలితే వారిని 20వేల సంచయంలో కలిపేలా చర్యలని తీసుకోబోతున్నారు. అంటే రెండు సమయాల్లో ఎక్కువగా మాస్టర్స్‌ హోల్డర్లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. దీని వల్ల అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో టెక్‌ కోర్సులు చేసి హెచ్‌-1బీ వీసా పొందే వారి సంఖ్య కనీసం 15 శాతం పెరుగుతుంది…2018లో హెచ్‌-1బీ వీసాలు పొందినవారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు.