ట్రంప్ అభిశంసన: డెమొక్రాట్లకు మద్ధతు, రిపబ్లికన్‌లలో చీలికలు  

అధికార బదలాయింపుకు ససేమిరా అనడంతో పాటు దొడ్డిదారిలో అధ్యక్ష పగ్గాలు మరోసారి చేపట్టాలని భావించిన డొనాల్డ్ ట్రంప్‌ లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటున్నారు.దీనికి తోడు క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన దాడి, అనంతరం జరిగిన పరిణామాలతో ఆయనను గడువుకు ముందే పదవిలోంచి తప్పించాలనే డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి.

TeluguStop.com - Trump Impeachment Causes Cracks In Republican Party

ఆయనపై అభిశంసన లేదంటే, 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించి ఉన్నపళంగా పదవిలోంచి దించేయాలని కేబినెట్ ఆలోచించే స్థాయికి వచ్చింది.

మరోవైపు అన్ని వర్గాల నుంచి ట్రంప్‌ను అధ్యక్షుడిగా తొలగించాలనే డిమాండ్ వస్తుండటంతో ఆయనపై డెమొక్రాట్లు.

TeluguStop.com - ట్రంప్ అభిశంసన: డెమొక్రాట్లకు మద్ధతు, రిపబ్లికన్‌లలో చీలికలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ తీర్మానానికి రిపబ్లికన్లు కూడా మద్ధతు తెలపడం విశేషం.

దిగువ సభలో డెమొక్రాటిక్ పార్టీ సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న డేవిడ్ సిసిలీన్ ఈ అభిశంసన తీర్మానాన్ని తయారు చేశారు.దీనికి 185 మంది మద్ధతు తెలిపారు.

అయితే ఈ అభిశంసన తీర్మానం రిపబ్లికన్‌లలో చీలకలకు కారణమవుతోంది.ట్రంప్‌ తీరుపై తొలి నుంచి గుర్రుగా ఉన్న కొంత మంది రిపబ్లికన్లు.ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతున్న అభిశంసనకు మద్దతుగా ఓటేస్తామని ప్రకటించారు.

రిపబ్లికన్ పార్టీలోని శక్తిమంతమైన నేతల్లో ఒకరైన లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు.అమెరికా చరిత్రలో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగం చేసినట్లగా మరెవరూ చేయలేదని ఆమె విమర్శించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి ట్రంప్‌ సూచనల మేరకే జరిగిందని ఆమె ఆరోపించారు.

ట్రంప్‌ జోక్యం చేసుకొని నాటి ఘటనను నిలువరించాల్సిందని లిజ్ చెనీ అభిప్రాయపడ్డారు.కీలక నేతలు ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌ కట్కో సహా మరికొందరు కూడా ట్రంప్‌‌కు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీలోని మరో వర్గం మాత్రం ట్రంప్‌ అభిశంసనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.కొద్దిరోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న క్రమంలో ఈ ప్రక్రియ ప్రారంభించడం రాజకీయ కుట్రేనని ఆరోపించింది.

#Impeachment #Power Change #Donald Trump #David Sicilian #25th Amendment

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు