సొంత పార్టీ సైడ్ అయ్యిపోయింది..చివరికి ఏం మిగిలింది ట్రంపూ...!!

బ్రతికి ఉండగానే నాలుగు రాళ్ళు వెనక వేసుకోవడం ఎంత ముఖ్యమో మన వెనుక నిలబడే వ్యక్తులు ఉండటం కూడా అంటే ముఖ్యం.వ్యక్తుల అభిమానం సంపాదించాలంటే నాలుగు మంచి పనులు చేసి ఉండాలి.

 Trump Has Become His Own Party Side, Trump, Trump To Step Down From The Presiden-TeluguStop.com

అసలేం చేయకపోయిన చెడు మార్గంలో నడవకుండా ఉంటె చాలు.కష్టం వచ్చినపుడు నేనున్నా అంటూ ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు.

కానీ ట్రంప్ అమెరికన్స్ కు మంచి చేసినా చివరి సమయంలో అమెరికా కాపిటల్ పై దాడి ఘటనతో ఒక్క సారిగా ట్రంప్ అమెరికా ద్రోహిగా మిగిలిపోయారు.ఏ రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్ గెలుపుకోసం ప్రయత్నాలు చేశారో ఇప్పుడు అదే పార్టీ నేతలు ట్రంప్ పై అభిశంసనకు మద్దతు ఇస్తున్నారు.

ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తొలగడానికి ఇంకా 10 రోజుల సమయం ఉన్నా సరే ఈలోగానే గద్దె దించాలని డెమోక్రటిక్ పార్టీ సంసిద్దమవుతోంది.ఈ మేరకు అభిశంసన ప్రక్రియపై ఏర్పాటు చెకచెకా చేస్తోంది.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.అభిశంస పెడితే తాము కూడా మద్దతు ఇస్తామని ఏకంగా ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లు మద్దతు ఇస్తున్నారు.దాంతో ఈ రోజు ప్రవేశపెట్టనున్న అభిశంసనపై సర్వాత్రా ఉత్కంట నెలకొంది.

Telugu Democratic, Process, Republican, Republicanpat, Trump, Trump American, Tr

ట్రంప్ అమెరికన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా అమెరికా కాపిటల్ పై దాడికి ఉసిగొల్పడం చిన్న నేరం మాత్రం కాదు, ఇది ప్రతీ ఒక్క అమెరికన్ కు బాధా కరమైన సంఘటనే అందుకే ట్రంప్ ని దించేయాలి అంటూ రిపబ్లికన్ పార్టీ నేత పాట్ టూమీ వ్యాఖ్యానించారు.ట్రంప్ వైఖరితో రిపబ్లికన్స్ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారని పాట్ తెలిపారు.రెండు ఉభయ సభలలో సాదాపు 150 మంది రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్ పై వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టీ సైతం ట్రంప్ ను దూరం పెట్టింది.ఇప్పటికి ట్రంప్ కు మద్దతు తెలిపితే పార్టీపై భిన్నాభిప్రాయాలు వస్తాయని అందుకే అభిశంసన విషయంలో రిపబ్లికన్ పార్టీ ట్రంప్ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదని అంటున్నారు.

ఇక ఈ అభిశంసన జరిగిన వెంటనే ట్రంప్ మరో రికార్డ్ కూడా క్రియేట్ చేయనున్నారు.అదేంటంటే ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా రెండు సార్లు అభిశంసన ఎదురోలేదు ఈ విషయంలో ట్రంప్ మొట్టమొదటి అధ్యక్షుడు కావడం మరో విశేషం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube