ట్రంప్ కల నెరవేరుతోంది....హెచ్-1 బీ వీసాలు తగ్గిపోతున్నాయి..!!!

ట్రంప్ ఏ ఆలోచనతో అయితే వీసాలా జారీ విషయంలో కఠినమైన వైఖరిని అవలంభించాడో ఆ దిశగానే ప్రస్తుత పరిస్థితి నెలకొంది.తమ దేశంలోకి విదేశీయుల వలసలని భారీగా తగ్గించి, తద్వారా స్థానికంగా ఉండే అమెరికన్లు ఎక్కువగా లబ్ది పొందే విధంగా , ఉద్యోగ అవకాశాలని అధికంగా కలిపించడానికి, ట్రంప్ ఇచ్చిన హామీ ప్రకారం హెచ్ -1 బీ వీసాల జారీ విషయంలో గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు ట్రంప్ ప్రభుత్వం చేపట్టిందో అందరికి తెలిసిందే.

 Trump Happy About H1b Visa Holders-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజా నివేదికల ప్రకారం.

ట్రంప్ కల నెరవేరుతోందిహెచ్-1

2018 ఆర్ధిక సంవత్సరంలో హెచ్‌-1బి వీసాల మంజూరులో దాదాపు 10 శాతం మేరకు తగ్గుదల నమోదు అయ్యిందని నిపుణులు తెలిపారు.వీసాల జారీ విషయంలో ట్రంప్ సర్కార్ అవలంభించిన కఠినమైన నిర్ణయాలే అందుకు కారణం అని అంటున్నారు.ఇదిలాఉంటే గత ఆర్ధిక సంవత్సరం లో అమెరికన్ సిటిజన్ షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీస్ విభాగం దాదాపు 3.35 లక్షల హెచ్‌-1బి వీసాలను మంజూరు చేసింది.అయితే ఇందులో కొత్తవి, రెన్యూవల్స్‌ చేసినవి కూడా ఉన్నాయని తెలిపారు.

2017 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 3.734 లక్షల వీసాలు మంజూరు చేయగా 2018 లో మాత్రం 10 శాతం మేరకు తగ్గిపోయాయని గణాంకాలు చెప్తున్నాయి.హెచ్‌-1బి వీసాల మంజూరును నిలువరించెందుకు ట్రంప్ చేపట్టిన విధానాలే అందుకు కారణమని ఇలానే ట్రంప్ చర్యలు ఉంటే అమెరికన్ ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉండవని తేల్చి చెప్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube