గూగుల్ పై ట్రంప్ చర్యలు..?? సుందర్ పిచాయ్ వ్యాఖ్యలపై గుర్రు గుర్రు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గూగుల్ సంస్థపై చర్యలు తీసుకోవడానికి సిద్డమయ్యారా.?? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.ట్రంప్ రాజకీయ కోణంలో సాగుతున్న హెచ్-1 బీ ఇతరాత్రా వర్క్ వీసాలపై నిషేధంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.విదేశీయుల ప్రతిభని అమెరికా అభివృద్ధి కోసం వాడుకుని ఇప్పుడు అవసరం లేదంటూ వీసాలని రద్దు చేసి మరీ ఆ ఉద్యోగాలలో అమెరికన్స్ ని కూర్చో పెట్టాలని చూస్తున్న ట్రంప్ విధానాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.

 Trump Serious On Google Ceo Sundar Pichai, Google, Sundar Pichai,donald Trump,wo-TeluguStop.com

జూన్ 24 నుంచీ డిసెంబర్ వరకూ ఈ తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన తరువాత ఈ విషయంపై స్పందించిన భారత సంతతి ఐటీ దిగ్గజం సుదర్ పిచాయ్ ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.వలసదారుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం కూడా సమర్ధించదగ్గది కాదని ఆయన గట్టిగానే చెప్పారు.

ఈ రోజు అమెరికా ఆర్ధికంగా ఈ స్థాయిలో ఉందంటే డానికి ప్రధాన కారణం వలస వాసులే అనే విషయాన్నీ ట్రంప్ గుర్తు పెట్టుకోవాలని ఘాటుగానే బదులు ఇచ్చారు.

Telugu America, Donald Trump, Google, Sundar Pichai, Trumpgoogle, Visas-

సాంకేతికంగా అమెరికా ప్రధమ స్థానంలో ఉండటానికి కారణం వలసవాసులలో ఉన్న ప్రతిభావంతులేనని అన్నారు.అమెరికా ప్రభుత్వం సహకరించక పోయినా గూగుల్ వలసవాసులకి అండగా ఉంటుందని ఆయన తెలిపారు.అయితే పిచాయ్ చేసిన ఈ వ్యాఖ్యలకి ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గూగుల్ మాట్లాడటం మంచిది కాదని అన్నారు.అంతేకాదు గూగుల్ పై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టుగా ట్రంప్ భావిస్తున్నారని తెలుస్తోంది.

మరి అదే జరిగితే అమెరికాలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube