హెచ్ 1 – బీ వీసాదారులకి ట్రంప్ తీపి కబురు..!!!     2019-01-12   10:12:42  IST  Surya Krishna

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకి హెచ్1-బి వీసాపై ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇన్నాళ్ళు అమెరికా కలని తాము నిజం చేసుకోగలమా, లేదా అనే భావనలో ఉన్న ఎన్నారైలకి ట్రంప్ కొత్త సంవత్సరం కానుకగా హెచ్1-బి పై కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు..అత్యంత విద్యావంతులైన ఎన్నారైలకి ,ప్రత్యేకమైన వ్రుత్తులతో పని చేసేందుకు జారీ చేసే హెచ్ 1- బి వీసా లని ఇప్పుడు ట్రంప్ సులభతరం చేస్తున్నాడు.

Trump Gives Good Announcement About H1B Visa Holders-Good News Holders H4 NRI Telugu Updates

Trump Gives Good Announcement About H1B Visa Holders

హెచ్1-బి వీసాపై పని చేస్తున్న ఎన్నారైలని అమెరికా పౌరులుగా గుర్తిస్తామని ట్రంప్ తెలిపాడు. ‘అమెరికాలోని హెచ్1-బి వీసాదారులు ఎటువంటి భయాందోళనలకి లోనవ్వకండి అంటూ ప్రకటన చేశాడు.
అత్యంత ప్రతిభావంతులని అమెరికా ఎప్పుడు ఆహ్వానిస్తుంది. వారిని మేము ప్రోత్సహిస్తాం’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ చేసిన ట్విట్ మీద దాదాపు 45 వేల ఇమ్మిగ్రెంట్స్ ,అమెరికన్స్ స్పందిచారు.మీరు క్రింద ట్విట్ పైన క్లిక్ చేసి చూడొచ్చు

Trump Gives Good Announcement About H1B Visa Holders-Good News Holders H4 NRI Telugu Updates

బ్యాచిలర్ డిగ్రీ లేదంటే అంతకంటే అధిక చదువులు కలిగిన వారు మాత్రమే ఈ వీసాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ట్రంప్ ప్రకటిస్తారు..2018లో అమెరికా ఈ తాత్కాలిక వీసాల జారీపై పరిమితి విధించింది. ఏప్రిల్ చివరికి అమెరికా సుమారు 65,000 హెచ్1-బి వీసాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇలాంటి డైలీ ఇమ్మిగ్రేషన్ న్యూస్ త్వరగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి TeluguNRINews/ పేజీ ఫాలో అవ్వండి ….TeluguStop.com NRI సెక్షన్ చూడండి