ట్రంప్ కి తప్పని పోల్స్ బెడద...తీవ్ర ఆగ్రహంలో...!!!

రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్ష్యుడు ట్రంప్ వెనుకబడి ఉన్నారని, గెలుపుని అందుకోలేనంత దూరంగా ఉన్నారని ఇంటర్నెట్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలు లీక్ అవ్వడంతో ఒక్క సారిగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీ చేస్తూ, అభ్యర్ధి రేసులో ఉన్న మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ తదితర నేతల కన్నా ట్రంప్ వెనుకపడ్డారని ఈ పోల్స్ తెలిపాయి.

 Trump Getting Trouble With Polls 1-TeluguStop.com

ట్రంప్ కి తప్పని పోల్స్ బెడద�

ఒపీనియన్ పోల్స్ ఫలితాలు అన్నీ తప్పుడు ప్రచారమని, కావాలనే ఇదంతా చేస్తున్నారని, ఈ ఫలితాల లీకేజ్ పై తన బృంద సభ్యులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ పోల్స్ నిర్వహణం అంతా బూటకమని చెప్పిన ట్రంప్ ఈ లీకేజ్ కి కారణమైన వారిని తన బృందం నుంచీ తొలగించడానికి రంగం సిద్దం చేశారని తెలుస్తోంది.

అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధిత్వ బరిలో రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ ముందు వరసలో ఉన్న విషయం అందరికి తెలిసిందే.గత ఎన్నికల్లో ఎంతో బలమైన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ని ఓడించి అధ్యక్ష ఫీటం దక్కించుకున్న విషయం విధితమే.

అయితే ఈ సారి మాత్రం ట్రంప్ కి అటువంటి అవకాశం లేదని పోల్స్ మాత్రమే కాదు అమెరికా రాజకీయ రాజకీయ అనుభవజ్ఞులు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube