ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను కుప్పకూల్చారు : కొత్త హోంలాండ్ చీఫ్ ఆరోపణలు

అమెరికా ఫస్ట్ నినాదంతో అగ్రరాజ్య పీఠాన్ని అధిష్టించిన డొనాల్డ్ ట్రంప్ స్థానికులు నష్టపోతున్నారంటూ వలసదారులపై కఠినంగా వ్యవహరించారు.ఇమ్మిగ్రేషన్ విధానంలో సరికొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

 Trump Dismantled Us Immigration System Homeland Security Chief, Donald Trump, Ho-TeluguStop.com

మెక్సికో సరిహద్దుల్లో గోడతో పాటు హెచ్ 1 బీ, హెచ్ 4, గ్రీన్ కార్డులు ఇలా అన్నింటా పరిమితులు తీసుకొచ్చారు.ట్రంప్ విధానాలతో విసిగిపోయిన వలసదారులు అధ్యక్ష ఎన్నికల్లో కసి తీర్చుకున్నారు.

ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న జో బైడెన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.వచ్చి రావడంతోనే హెచ్ 1 బీ, హెచ్ 4 వీసాలపై వున్న నిషేధాన్ని ఎత్తివేశారు.

హెచ్ 1 బీ వీసాల ఎంపికకు సంబంధించి లాటరీ విధానాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.గ్రీన్ కార్డు జారీలో దేశాలపై వున్న కోటా పరిమితిని ఎత్తేశారు.

ఈ నేపథ్యంలో అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి కొత్త అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అలెజాండ్రో మయోర్కాస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై విరుచుకుపడ్డారు.దశాబ్ధాలుగా వున్న యూఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ట్రంప్ కుప్పకూల్చారని అలెజాండ్రో మండిపడ్డారు.

దీనిని మళ్లీ మొదటి నుంచి పునర్నిర్మించడానికి సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.దీనిని సాధించడానికి అంకిత భావంతో పనిచేస్తామని అలెజాండ్రో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

అలాగే అమెరికా కాంగ్రెస్ మానవత్వంతో ఆమోదించిన బిల్లులను అమలు చేయడానికి సరైన సౌకర్యాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చట్టాలను ఆచరణలో పెట్టడానికి తమకు సిబ్బంది, విధి, విధానాలు, శిక్షణ లేదని.

ట్రంప్ యంత్రాంగం ఈ తరహా వ్యవస్థను నాశనం చేసిందని మయోర్కాస్ మండిపడ్డారు.

Telugu Alejandro, Donald Trump, System-Telugu NRI

అంతేకాకుండా ఉత్తర అమెరికా దేశాలకు చెందిన పిల్లలకు రక్షణ కల్పించే అమెరికన్ మైనర్ ప్రొగ్రాంను ట్రంప్ ఎత్తేశారని ఆయన వ్యాఖ్యానించారు.ప్రధానంగా గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్‌లకు నిధులను తగ్గించారని హోంలాండ్ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్‌కు చెందిన ఫ్రంట్‌లైన్ సిబ్బందితో సహా సరిహద్దుల్లో సేవలు అందించే ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను రక్షించడానికి ట్రంప్ యంత్రాంగం ఎలాంటి ప్రణాళికను రూపొందించలేదని ఆయన దుయ్యబట్టారు.

హోంలాండ్ సెక్యూరిటీ 18వ వార్షికోత్సవమైన మార్చి 1న ఇలాంటి విషయాలు పంచుకోవడం బాధగా వున్నప్పటికి ప్రజలకు తెలియాల్సిన అవసరం వుందని అలెజాండ్రో తెలిపారు.

కాగా, ఆదివారం ఫ్లోరిడాలో మాట్లాడిన ట్రంప్.

మెక్సికో సరిహద్దుల్లో వలసదారులను అనుమతించడంపై స్పందించారు.అక్రమ మార్గాల్లో ప్రవేశించాలనుకునే వారికి అమెరికాలో అడుగుపెట్టేందుకు తలుపులు తెరవడం ద్వారా బైడెన్ యంత్రాంగం జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసిందని ట్రంప్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడిపై అలెజాండ్రో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube