కొంప ముంచేసిన ట్రంప్ సలహా..!!!

అమెరికాలో కరోన వ్యాప్తి తీవ్రతరం అయిన నేపధ్యంలో అధికారులు కరోనా కంట్రోల్ కి చేయని ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.అమెరికాలోని మొత్తం యంత్రాంగం కరోన కట్టడికి పరుగులు పెడుతోంది.

 Cleaning Products, Disinfectants, Coronapatients,uspresident,donald Trump-TeluguStop.com

వేలాది మంది ప్రజలు రోజు రోజుకి కరోనా బారిన పడుతుంటే వైద్య నిపుణులు ప్రజల ప్రాణాలని కాపాడటానికి తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అయితే ఇక్కడ మరొక విషయ ఏమిటంటే ట్రంప్ రెండు రోజుల క్రితం కరోనా కట్టడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.

ఆ తరువాత నాలిక కరుచుకున్న విషయం కూడా విధితమే.కానీ.

ట్రంప్ అతి తెలివి తేటలను ఒప్పుకున్న విషయం న్యూయార్క్ అధికారులకి తెలియలేదు కాబోలు దాంతో అధ్యక్షుడి మాటలని తూచా తప్పకుండా ఆచరించేశారు.మానవ శరీరంలో కరోనా వైరస్ ని అరికట్టేందుకు హౌస్ క్లీనర్ లని వాడచ్చు అనే విషయాన్ని బ్లైండ్ గా మైండ్ లోకి ఎక్కించుకున్న అధికారులు ఆచరణలో పెట్టేశారు.

కరోనా బాధితులు కొందరిపై క్లినికల్ ట్రైల్స్ కూడా చేసేశారు.దాంతో

Telugu Products, Donald Trump-

18 గంటలు గడిచే లోగా ఈ హోమ్ క్లీనర్ ల విష ప్రభావానికి దాదాపు 30 మంది అనారోగ్యం పాలయ్యి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ 30 కేసుల్లో సుమారు 10 కేసులు లైజాల్ వాడటం వలన జరిగిందని మరొక పది కేసులు బ్లీచింగ్ వాడటం వలన జరిగిందని మిగిలిన కేసులు వివిధ రకాల క్లీనర్స్ వాడటం వలన జరిగిందని తేల్చారు.ఈ వివరాలని న్యూయార్క్ ఆరోగ్య శాఖ స్వయంగా మీడియాకి వివరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube