ఈబీ -5 వీసాపై ట్రంప్ సంచలన నిర్ణయం

ట్రంప్ విధానాలు అన్ని దేశాల వారిని ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తున్నాయి.ఒక పక్క హెచ్ -1 బీ వీసాతో విదేశీ ఎన్నారైలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న అమెరికా ప్రభుత్వం ఆతరువాత హెచ్ -4 వర్క్ పర్మిట్ పై కూడ తీవ్రమైన ఆంక్షలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తజా గా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మరో మారు ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది.

 Trump Decision On Eb 5 Visa-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

ఉన్నట్టుండి షాకులు ఇవ్వడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అలవాటే.వీసాల నిభంధనలతో షాకులు ఇచ్చే ట్రంప్.ఇప్పుడు ఈబీ5 వీసాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై అమెరికా కాంగ్రెస్‌కు తెలిపారు ట్రంప్…ఈబీ5 వీసా విదేశీయులకు జారీ చేసే వీసా.వ్యాపారవేత్తలు అమెరికాలో కనీసం ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.6.8 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తే వారికి ఈబీ5 వీసా జారీ చేస్తారు.ఇది గ్రీన్ కార్డుతో సమానం.అయితే

ఈ పద్దతులలో ఈబీ -5 వీసాని పొందిన వారు అనేక దొంగ మార్గాలని అనుభవిస్తున్నారని.

ఎన్నో రకాల మోసాలని పాటిస్తున్నారని తెలుసుకున్న ట్రంప్.కటినమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ నిర్ణయంతో అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఏకీభవిస్తున్నారు…ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ఈబీ- 5 రీజినల్ సెంటర్ ప్రోగామ్ ముగియనుంది.అ.అయితే ట్రంప్ నిర్ణయంతో ఆయా దేశాల వ్యాపారులు ఏంతో ఆందోళనకి లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube