ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శరణార్థులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.లాస్ వేగాస్ లో రిపబ్లికన్ యూదుల సంఘంతో సమావేశం అయిన ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాకరేపుతోంది.

 Trump Controversial Comments-TeluguStop.com

వలసదారుల వల్ల సెంట్రల్‌ అమెరికాలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు శరణార్థులకి ఆశ్రయం కలిపించడాన్ని కూడా ఓ కుంభకోణంతో పోల్చారు.

కొంత మంది శరణార్థులను చూస్తే యూఎఫ్‌సీ క్రీడలో పోరాటానికి వచ్చే వస్తాదుల్లా అనిపిస్తారని వ్యాఖ్యానించారు ట్రంప్.దాంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా నవ్వారు.అక్కడితో ఆగకుండా ట్రంప్

ఆశ్రయానికి దరఖాస్తు చేసుకొనే శరణార్థులకు శిక్షణ ఇచ్చే లాయర్లపై కూడా వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో వలసలకు కొన్ని దేశాలు కారణమన్ ట్రంప్ అన్నారు.ఆ దేశాల అధికారులు వలసలను నివారించడంలో విఫలం కావడంతో తాను రంగంలో దిగాక తప్పలేదని అన్నారు ట్రంప్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube