వదిలేది లేదు..పోరాటం కొనసాగుతుంది : ట్రంప్

అమెరికా ప్రస్తుత కాబోయే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓటమిపై ఇప్పటికి తన వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.బిడెన్ ధర్మంగా గెలవలేదని, ఎన్నో కుయుక్తులతో గెలుపు సాధించాడని ట్రంప్ ఇప్పటికి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

 Trump Continues To Fight, Donald Trump, Corrupt Elections, Biden, States Of Geor-TeluguStop.com

తాజాగా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇప్పటికి తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తన పోరాటం ముగియలేదని భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించారు.ట్రంప్ తరపున వేసిన ఓ పిటిషన్ ను నిన్నటి రోజున సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విధితమే.ఈ క్రమంలోనే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

అమెరికా చరిత్రలో ఇంత అవినీతి మాయమైన ఎన్నికలు జరగలేదని, పూర్తి స్థాయి అవినీతిలో ఈ ఎన్నికలు జరగాయని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు.

పెన్సిల్వేనియా, జార్జియా రాష్ట్రాలలో తానె గెలిచానని కానీ అక్రమాలు జరగడం వలనే తనను ఓడినట్టుగా అక్కడ చూపారని ట్రంప్ ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు.సుప్రీంకోర్టు ట్రంప్ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన వెంటనే ట్విట్టర్ లో ట్రంప్ ఎదురు దాడి చేయడం మొదలు పెట్టారు.

Telugu Biden, Corrupt, Donald Trump, Pennsylvania, Georgia, Trump-Telugu NRI

కోర్టులలో ఈ అవినీతి ఎన్నికల పై సమరం చేయడానికి మాకు తగినంత సమయం దొరకలేదు.కానీ ఉన్న సమయంలోనే ఎంతో వేగంగా మేము స్పందించాము ఎన్నో అక్రమాలు ఈ ఎన్నికల్లో జరిగాయని కోర్టులకు సమర్పించాము అయినా న్యాయం జరగడం లేదు.చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా వాళ్ళు వేసుకున్నారు ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా, ఇది కూడా ఓ గెలుపేనా అంటూ ట్వీట్ చేశారు.నా పోరాటం ముగిసిపోలేదు కొనసాగుతుంది.

అమెరికన్స్ ను ఈ ప్రమాదం నుంచి కాపాడాలని అనుకుంటున్నాను వారికి అండగా ఉంటాను అంటూ ట్రంప్ తన ట్వీట్ లను కొనసాగించారు.అయితే ఓడిపోయాను అనే బాధలో ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని ఎదురు దాడికి దిగుతున్నారు డెమోక్రటిక్ పార్టీ నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube