ట్రంప్ : నేను ముందే చెప్పా...చైనా భారీ మూల్యం చెల్లించాల్సిందే...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి చైనాపై మండిపడ్డారు.యావత్ ప్రపంచం చైనా కారణంగా ఎన్నో అవస్థలు పడుతోందని, ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయని ఇంత పెద్ద ఉపద్రవం ఎన్నడూ జరగలేదని చైనాపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

 Trump Comments On China Wuhan Lab Virus Leak-TeluguStop.com

కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోనే అని ముందు నుంచీ తాను చెప్పింది నిజమయ్యిందని, చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే మహామ్మారి తయారయ్యిందని మరో సారి ఆరోపించారు ట్రంప్.చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే వైరస్ తయారయ్యిదని పలు పరిశోధనల్లో తేలడంతో ట్రంప్ తాజాగా మరో సారి తనదైన శైలిలో చైనాపై విరుచుకుపడ్డారు.

కోట్లాది మంది ప్రజలు చనిపోయారని, ఎంతో ఆస్తి నష్టాన్ని అన్ని దేశాలు చవి చూశాయని , ఈ పరిణామాలు అన్నిటికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.తాను చైనాపై ఆరోపణలు చేసిన సమయంలో తన శత్రువులు ఈ విషయాన్ని అంగీకరించలేదని కానీ ఇప్పుడు అందరూ కరోనా వైరస్ చైనా సృష్టి అనడం చూస్తుంటే నవ్వు వస్తోందని, ఇప్పటికైనా వారు కళ్ళు తెరవడం చాలా మంచిది అయ్యిందని అన్నారు.

 Trump Comments On China Wuhan Lab Virus Leak-ట్రంప్ : నేను ముందే చెప్పా…చైనా భారీ మూల్యం చెల్లించాల్సిందే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తీవ్ర ఆస్తి నష్టానికి కారణమైన చైనా అమెరికాకు మాత్రమే కాకుండా అన్ని దేశాలకు 10 ట్రిలియన్ డాలర్లు చేలించాలని డిమాండ్ చేశారు.

Telugu $ 10 Trillion, Anthony Fauci, China, Corona Virus, Donald Trump, The White House, Trump, Wohan Lab-Telugu NRI

ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ తన వాదనలతో అప్పట్లో ఏకీభవించలేదని, తన ఆరోపణలను కొట్టి పారేశారని ఆరోపించారు.చైనా పై అమెరికా ప్రభుత్వం ఉదార స్వభావం చూపడం మంచిది కాదని, చైనాపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.ఇదిలాఉంటే శ్వేత సౌధం నుంచీ వెళ్ళిపోయినా తరువాత పెద్దగా మీడియా ముందుకు రాని ట్రంప్ తాజాగా కరోనా వైరస్ కు చైనా తో లింకులు ఉన్నాయంటూ పలు కధనాలు వెలువడటంతో మళ్ళీ తెరపైకి వచ్చారు.

#Trump #Corona Virus #White #Wohan Lab #China

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు