ప్రజల్ని మనమే చైనా పంపిస్తున్నాం: బైడెన్ కొత్త ట్యాక్స్ పాలసీపై ట్రంప్ ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.బైడెన్ యంత్రాంగం ప్రతిపాదించిన కొత్త పన్ను విధానం చైనాకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన ఆరోపించారు.

 Trump Chides Biden's Proposed Tax Changes, Says Us Administration Incentivising-TeluguStop.com

గత ప్రభుత్వ హయాంలోని పన్ను తగ్గింపు విధానాలను ఉపసంహరించాలని జో బైడెన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

శనివారం అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని అయోవా స్టేట్ ఫెయిర్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘‘సేవ్ అమెరికా’’ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.

జో బైడెన్ ప్రతిపాదనతో అమెరికాలో బిజినెస్ ట్యాక్స్‌ రేటు ప్రపంచంలోనే ఎక్కువగా మారుతుందని ట్రంప్ ఆరోపించారు.దీని వల్ల అమెరికా వ్యాపారులు చైనా వైపు మొగ్గుచూపి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.

మనంతట మనమే పెట్టుబడిదారులు, ప్రజలను చైనా వైపుకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నామని ట్రంప్ ఎద్దేవా చేశారు.డెమొక్రాట్ చట్టసభ సభ్యులు ట్రంప్ హయాం నాటి పన్ను తగ్గింపులను వెనక్కి తీసుకునే ప్రణాళికలను విడుదల చేసిన నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.పన్ను విధానాన్ని నియంత్రించే పవర్‌ఫుల్ వేస్ మీన్స్ కమిటీ సభ్యులు కార్పోరేషన్ పన్ను రేటును 21 శాతం నుంచి 26.5 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.

కాగా, తైవాన్‌పై చైనా దూకుడు నేపథ్యంలో అమెరికా వైఖరిని నిరసిస్తూ జో బైడెన్ పాలనపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అమెరికా, చైనాలు యుద్ధం చేసే పరిస్థితులు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు.

గత కొన్ని రోజులుగా తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల హాడావిడి పెరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం అమెరికాను అవినీతి, బలహీన ప్రభుత్వం పాలిస్తోందని, ఈ ప్రభుత్వాన్ని డ్రాగన్ గుర్తించడం లేదని ఆయన చురకలు వేశారు.

అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిజమైన విజయం తనదేనని.అప్పుడు రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ మళ్లీ ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube