రాణి ఎలిజబెత్-2 ను తాకిన ట్రంప్ మరోసారి ట్రంప్ ని టార్గెట్ చేసిన నెటిజన్లు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్నారు.గతంలో బ్రిటన్ థెరిస్సా మే కు ఒక సమయంలో చేయి అందించారు అని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

 Trump Break The Royal Protocol-TeluguStop.com

గతంలో రష్యా వెళ్ళినప్పుడు కూడా ట్రంప్ తన భార్య మెలానియా చేతిని తన చేతితో పట్టి అందరి లో ఒక ఆదర్శ దంపతులుగా మెలిగి వార్తల్లో నిలిచారు.అయితే ఇప్పుడు తాజాగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ను తాకి మరోసారి వార్తల్లో నిలిచారు.

ట్రంప్ ఎక్కడకి వెళ్లినా ఎదో ఒక తెంపరి పని చేస్తూ నిత్యం వారాల్లోనే నిలుస్తున్నారు.

అయితే ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటనలో ఉన్న ట్రంప్ గౌరవార్ధం బకింగ్ హమ్ ప్యాలెస్ లో రాణి ఎలిజబెత్-2 ఇచ్చిన విందుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ తన ప్రసంగం ముగిశాక ఆమె వెనుక వైపు తన ఎడమచేతితో సున్నితంగా తాకాడు.72 ఏళ్ల ట్రంప్ 93 ఏళ్ల రాణి పట్ల ఇలా వ్యవహరించడం రాయల్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించడమే నని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాణి ఎలిజబెత్-2 ను తాకిన ట్రంప�

ప్రసంగం చేస్తున్నంతవరకు బాగానే ఉన్న ట్రంప్ ఆ తరువాత చొరవ తీసుకొని ఎలిజబెత్ ను తాకారు.రాణిని ఒకరు తాకడం నిషేధమని, రాచరిక కుటుంబం పట్ల ఒకరు ఎలా వ్యవహరించాలన్నది నిబంధనల్లో లేకపోయినప్పటికీ అది ఓ తప్పిదమేనని అక్కడి న్యూస్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు మరోసారి ట్రంప్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రోటోకాల్ ని ఉల్లంఘించి ట్రంప్ తప్పుచేశారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube