చైనా దిమ్మ తిరిగిపోయింది..ఏందెబ్బకొట్టావ్ ట్రంపూ...!!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో ట్రంప్ దాదాపు ఓడిపోవడం ఖాయమంటూ పలు సర్వేలు, రాజకీయ పరిశీలకులు సైతం బహిరంగంగ ప్రకటనలు చేస్తున్నారు.

అమెరికన్ ప్రజలు సైతం ట్రంప్ పై గడిచిన కొన్ని నెలలుగా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు ఎందుకంటే కరోనా మహమ్మారి అమెరికాలో ప్రవేశించక ముందే ట్రంప్ జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం, కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా ట్రంప్ పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడమే.కానీ భవిష్యత్తులో ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందని ట్రంప్ ఊహించలేక పోయారు.

Trump Bans China Telecom In US, America, President Elections, China, Donald Trum

దాంతో అమెరికాలో ఈ మారణహోమానికి కారణమైన చైనా పై చర్యలు తీసుకుని అమెరికా ప్రజలని శాంతిపజేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే చైనాతో వాణిజ్య సంభంధాల విషయంలో కటినమైన వైఖరిని అవలంభిస్తున్నారు.

చైనాపై ఆధారపడకుండా ఉండేదుకు అన్ని రకాల దిగుమతులను తమ దేశం నుంచి తయారు చేసుకునేలా, వేరే దేశాలతో ఒప్పందాల ద్వారా ఆ భర్తీని పూరిస్తున్నారు.అంతేకాదు చైనాపై చర్యలలో భాగంగా తాజాగా చైనా దేశంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకి అలాగే రక్షణ వ్యవస్థకి ముప్పు ఉందని వాదనని తెరపైకి తీసుకువచ్చారు.

Advertisement

అక్కడితో ఆగకుండా అమెరికాలో సేవలు అందిస్తున్న చైనా టెలికాం సంస్థపై నిషేధాన్ని విధించడానికి సిద్దమయ్యారు.చైనా టెలికాం ని రద్దు చేయాలని, నిషేధించాలని అమెరికా ఫెడరల్ కమ్యునికేషన్ కి రక్షణ హోమ్, వాణిజ్య తో పాటు అత్యున్నతమైన శాఖలు అన్ని లేఖలు రాశాయి.

అమెరికా దేశానికి సంభందించిన విలువైన సమాచారం చైనా టెలికాం దొంగిలించే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖ హెచ్చరికలు చేసింది.అయితే చైనా టెలికాం పై వేటుపడితే లక్షలాది మంది అమెరికన్స్ కమ్యునికేషన్స్ దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు