శ్వేతసౌధం లో దీపావళి వేడుకలకి...ట్రంప్   Trump At Deepawali Celebrations In White House     2018-11-10   18:30:09  IST  Surya

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన శ్వేతసౌధంలో వచ్చే మంగళవారం దీపావళి వేడుకలని జరుపుకోనున్నారు. ఒక పక్క వీసాల విధానాలతో ట్రంప్ భారతీయులని ముప్పు తిప్పలు పెడుతూనే మరో పక్క వారిని మచ్చిక చేసుకుంటూ భారతీయులని పొగిడేయడం విధితమే..అయితే ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న భారత సంతతి అధికారులు, రాజకీయ నేతలు ఈ వేడుకలకి హాజరవుతారని తెలుస్తోంది.

శ్వేత సౌధంలోని తన అధికారిక కార్యాలయంలో (ఓవల్‌ ఆఫీస్‌) మంగళవారం నిర్వహించే వేడుకల్లో ఆయన పాల్గొననున్నట్లు వైట్‌ హౌజ్‌ అధికారులు వెల్లడించారు…పండుగకు ముందురోజు అమెరికాలో దీపావళి జరుపుకొనే భారతీయ అమెరికన్లందరికీ ట్రంప్‌..ఆయన భార్య మెలానియా ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Trump At Deepawali Celebrations In White House-

అంతేకాదు భారత్ అమెరికా మధ్య ఉన్న గొప్ప మైత్రికి తప్పకుండా ఈ దీపావళి పండుగ ఒక నిదర్సనంగా నిలుస్తుందని వారు తెలిపారు..ఈ దీపావళి వేడుకల్లో ప్రభుత్వంలో వివిధ హోదాలో ఉన్న భారతీయ అమెరికన్లు సహా…ప్రముఖ భారతీయ వేత్తలు అందరూ పాల్గొననున్నారని తెలుస్తోంది.