ఎట్టకేలకి ట్రంప్ బయటపడ్డాడు...!!!

కొద్ది రోజులుగా డెమోక్రటిక్ పార్టీ నేతలు ట్రంప్ పై తీవ్ర స్తాయిలో అభియోగాలు చేస్తూ అభిశంసన పెట్టిన విషయం విధితమే.ఈ క్రమంలో ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ కూడా ట్రంప్ పై దర్యాప్తు ఆదేశించింది.

 Trump Ask To Investigation To China Ukraine-TeluguStop.com

డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న బిడెన్ పై విదేశాలతో కలిసి కుట్ర పన్నారు అనే ఆరోపణలు నేపధ్యంలో ఈ అభిశంసన పెట్టిన సమయంలో ట్రంప్ ఇప్పటి వరకూ ఆ విషయంపై స్పందిచలేదు.కానీ

తాజాగా ట్రంప్ ప్రకటన చూస్తే గతంలో ట్రంప్ కుట్రలు చేశారు అనే విషయం స్పష్టంగా వెల్లడవుతుందనే అంటున్నారు డెమొక్రాట్స్.

డెమోక్రటిక్ పార్టీ తరుపున ట్రంప్ కి పోటీ గా నిలిచిన జో బిడెన్ పై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని ట్రంప్ తాజగా ఉక్రెయిన్, చైనా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశారు.ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ డెమోక్రాట్లు తనని మరోసారి అధ్యక్షుడు కాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Telugu American, Democratic, China Ukraine, Telugu Nri Ups, Trump-

వైట్ హౌస్ లో మీడియాలో మాట్లాడిన ట్రంప్ బిడెన్ పై వచ్చిన ఈ అభియోగాలపై విచారణ వేగవంతంగా చేపట్టాలని నేను రెండు దేశాలని కోరుతానని ట్రంప్ తెలపడం అందరికి షాక్ ఇచ్చింది.జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలో తన కుమారుడికి లబ్ది చేకూరేలా ఇరు దేశాల నుంచీ పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారని ఆరోపణలు ఉన్నాయి.అయితే ఈ ఆరోపణలు బిడెన్ ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube