అధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఘోరమైన పరాజయం చవిచూసిన డోనాల్డ్ ట్రంప్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటారని అందరూ భావించారు.కనీసం బిడెన్ ప్రమాణ స్వీకారానికి ఉండకుండా ఆనవాయితీని కాదని మరీ అవమాన భారంతో వైట్ హౌస్ వీడిన ట్రంప్ చాలా కాలం విరామం తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట.

 Trump As Presidential Candidate , Trump, Biden, Americans, Republican Party-TeluguStop.com

అంతేకాదు 2024 ఎన్నికల్లో మరో సారి అధ్యక్షుడిగా పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవడానికి ఇప్పటి నుంచీ గ్రౌండ్ సిద్దం చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

రిపబ్లికన్ పార్టీ తరుపున మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడటానికి ట్రంప్ ఉవ్విళ్ళూరుతున్నారని త్వరలో ఓ వేదిక మీదుగా తన నిర్నయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 28 న జరగనున్న కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ వార్షిక సమావేశంలో పాల్గొననున్న ట్రంప్ అదే వేదికగా తాను మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయ్.

ట్రంప్ హయాంలో తీసుకున్న ప్రతీ నిర్ణయం అమెరికా అభివృద్దికి, అమెరికన్స్ ఎదుగుదలకు సంభందించినదేనని కానీ బిడెన్ తన విధానాలు అన్నిటిని వలస వాసుల కోసమే రద్దు చేస్తున్నారని, బిడెన్ వలన అమెరికా ప్రజలకు ఒరిగేది లేదని వాదిస్తున్నారు ట్రంప్.

ఇవే అంశాలు హైలెట్ చేస్తూ 28 న బిడెన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకువచ్చే ప్రణాళిక సిద్దం చేశారని, ఈ క్రమంలోనే ట్రంప్ మరో సారి అధ్యక్షుడిగా తాను బరిలో ఉంటానని ప్రకటించనున్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్ధిత్వంపై అడ్డు చెప్పేవారు ఉండగా మెజారిటీ శాతం ట్రంప్ మరో సారి అధ్యక్షుడు కావాలంటూ మద్దతు ఇచ్చే వారి సంఖ్య అధికంగా ఉందని ఓ సర్వే ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube