ట్రంప్ మరో పిడుగు.. జన్మతః పౌరసత్వం రద్దు..!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసదారులని చాలా తీవంగా అణిచివేయాలని భావిస్తున్నారు.వలస దారులకోసం అమలు చేసే విధానాలని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.

 Trump Anethor Decision On Immigrants In America-TeluguStop.com

మధ్యంతర ఎన్నికలకు ముందు వలసదారుల నియంత్రణకు పటిష్ట విధానాలను అమలు చేయడం వల్ల తనకు మద్దతు పెరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోందని అంటున్నారు అమెరికాలోని నిపుణులు.అయితే ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ తన ఓ వార్తా చానెల్ ఇంటర్వ్వూ లో వెల్లడించాడు.

అంతేకాదు అమెరికా పౌరులు కానివారికి, అనధికారిక వలసదారులకు జన్మించిన బిడ్డలకు జన్మతః పౌరసత్వం పొందేందుకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కును రద్దు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.ఇమ్మిగ్రేషన్‌పై ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు.దీనివల్ల తన మద్దతుదారులు బలోపేతమవుతారని, కాంగ్రెస్‌ను నియంత్రణలో ఉంచడానికి రిపబ్లికన్లకు అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే రాజ్యాంగాన్ని సవరించి, జన్మతః లభించే పౌరసత్వ హక్కును రద్దు చేసినట్లయితే, చాలామంది న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించినవారికి పౌరసత్వం లభిస్తుంది.దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి, రద్దు చేస్తే, న్యాయ పోరాటం తప్పదు కదా అన్న ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఈ పని కానిచ్చేయవచ్చునని తమ న్యాయ నిపుణులు చెప్తున్నారని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube