యూఏఈకి ఏజెంట్‌లా అమెరికాలో లాబీయింగ్.. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడికి జైలు శిక్ష

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు టామ్ బరాక్‌‌‌ను మంగళవారం అరెస్ట్ చేశారు.యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరపున ఆయన అక్రమంగా లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 Trump Ally Tom Barrack Jailed On Charges Of Illegal Lobbying For Uae-TeluguStop.com

దీని వల్ల 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారంతో పాటు అమెరికా విదేశీ విధానంపై నేరుగా ప్రభావం పడిందని బ్రూక్లిన్‌లోని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ కథనం ప్రకారం.

 Trump Ally Tom Barrack Jailed On Charges Of Illegal Lobbying For Uae-యూఏఈకి ఏజెంట్‌లా అమెరికాలో లాబీయింగ్.. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడికి జైలు శిక్ష-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏప్రిల్ 2016 నుంచి ఏప్రిల్ 2018 మధ్య కాలంలో యూఏఈకి ఏజెంట్‌గా వ్యవహరించినందుకు గాను బరాక్‌పై ఏడు కౌంట్ల నేరారోపణలు నమోదు చేశారు.న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించడంతో పాటు ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లకు తప్పుడు ప్రకటనలు చేయడం వంటి అభియోగాలు కూడా ఆయనపై వున్నాయి.

బరాక్‌తో పాటు కొలరాడోకి చెందిన మాథ్యూ గ్రిమ్స్‌, యూఏఈ జాతీయుడు రషీద్ సుల్తాన్ రషీల్ అల్ మాలిక్ అల్షాహిపై అభియోగాలు మోపారు.

ట్రంప్ ఎన్నికల ప్రచారానికి సీనియర్ సలహాదారుగా వున్న హోదాను అడ్డుపెట్టుకుని యూఏఈ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, మేధోపరమైన సాయం అందించారని సీఎన్ఎన్ నివేదించింది.

ఆరోపణల ప్రకారం.బరాక్ ప్రత్యక్షంగా, పరోక్షంగా యూఏఈ సీనియర్ నాయకత్వంతో సంబంధాలను కలిగి వున్నాడు.

అమెరికాలో తన విదేశాంగ విధాన ఎజెండాను ప్రోత్సహించడానికి అల్షాహిని ‘‘రహస్య ఆయుధం’’గా వినియోగించుకున్నాడని సీఎన్ఎన్ తెలిపింది.ఈ కేసులో భాగంగా బరాక్, మ్యాథ్యూ గ్రిమ్స్ లాస్ ఏంజిల్స్‌లోని కోర్టు ఎదుట హాజరయ్యారు.

ఈ సందర్భంగా యూఎస్ మేజిస్ట్రేట్ ప్యాట్రిసియా డోనాహ్యూ వారిద్దరినీ నిర్బంధించాలని అధికారులను ఆదేశించారు.లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియాలతో సత్సంబంధాలను కలిగివున్న బరాక్‌ను సంపన్న, శక్తివంతమైన వ్యక్తిగా ప్రాసిక్యూటర్లు అభివర్ణించారు.

Telugu Barack, Donald Trump, Federal Law Enforcement Agents, Grimes, Rashid Sultan, Rashil Al Malik Alshahi, Trump Ally Tom Barrack Jailed On Charges Of Illegal Lobbying For Uae, United Arab Emirates-Telugu NRI

2016, 2017లలో టీవీ ప్రదర్శనల కోసం బరాక్, అల్షాహి, గ్రిమ్స్‌లు యూఏఈ అధికారుల నుంచి టాకింగ్ పాయింట్లను అందుకున్నారు.ఇందులో బరాక్ యూఏఈ ప్రయోజనాలను ప్రోత్సహించినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.2016లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత వీరు ముగ్గురు.యూఏఈ ఆదేశాల మేరకు ఆ దేశ ప్రయోజనాలను కొనసాగిస్తూనే వున్నారు.2016 డిసెంబర్‌లో బరాక్, గ్రిమ్స్, అల్షాహిలు యూఏఈ సీనియర్ ప్రభుత్వ అధికారులతో ఒక సమావేశానికి సైతం హాజరయ్యారు.యూఏఈ సీనియర్ అధికారులతో టచ్‌లో వుండటానికి బరాక్ ఒక మేసేజింగ్ యాప్‌తో పాటు సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.

#TrumpAlly #RashilAl #UnitedArab #FederalLaw #Rashid Sultan

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు