భారతీయులు మనుషులే ట్రంప్..     2018-07-18   14:06:28  IST  Bhanu C

భారతీయులు అంటే అమెరికా దేశాధ్యక్షుడుకి పురుగుల్లా నేరస్తులుగా కనిపిస్తున్నారని…అమెరికాలో ప్రవేశించిన

భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను అంత చిన్న చూపు చూడటం సమంజసం కాదని న్యాయ సేవల సంస్థల వలంటీర్లు చెబుతున్నారు..కర్మాగారాల్లో సిక్కుల తలపాగాలనూ తీసేసుకుంటున్నారని చెప్తున్నారు.. ‘‘అక్కడ 18 ఏళ్ల యువకులు మొదలుకొని అందరికీ ఖైదీల వస్త్రాలు వేసుకొమ్మంటున్నారు. వారిని నేరస్థుల్లా పరిగణిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోందని వాపోయారు…

Trump..All Indians Are Humans Not Prisoners-

Trump..All Indians Are Humans Not Prisoners

ఆశ్రయం కోరుతూ సరిహద్దులను దాటినందుకే ఇంత పెద్ద శిక్ష వేయాలా అంటూ వాలంటీర్‌ నవనీత్‌ కౌర్‌ ప్రశ్నించారు. గత కొన్నివారాల్లో ఆమె 52 మందికిపైగా భారతీయులను జైళ్లలో కలిశారు. స్వచ్ఛంద న్యాయసేవల సంస్థ ఇన్నోవేషన్‌ లా ల్యాబ్‌ తరఫున వలంటీర్‌గా ఆమె పనిచేస్తున్నారు. జైళ్లలో గడుపుతున్నవారికి న్యాయ సేవలను అందిస్తున్నారు. అక్కడ భారతీయుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

అక్కడ ఒక జైల్లో 52 మంది ఉన్నారని వారిలో ఎక్కువగా పంజాబీలే ఉన్నారని తెలిపారు..వారి చేతికి సంకెళ్లు బిగించివున్నాయి…అలానే వారు భోజనం చేస్తున్నారు…ఎంతో కరుడుగట్టిన నేరస్తులని కూడా అలా చూడరు భారత వ్యక్తులు అంటే ఎందుకు అంత చులకనా అంటూ ప్రశ్నించారు..‘‘అందరికీ నచ్చిన మతాన్ని విశ్వసించే హక్కుండే అమెరికాలో.. సిక్కుల తలపాగాలను లాగేసుకుంటున్నారు…అని ఆమె వివరించారు