అమెరికా: సలహాదారుల ప్రచారం... ట్రంప్ మెడకు మరో ఉచ్చు, కీలక పత్రాల్లో వెలుగులోకి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టైం అస్సలు బాగోలేనట్లుగా వుంది.ఇప్పటికే అధికారం కోల్పోయిన ఆయన.

 Trump Advisers Illegally Campaigned While In Office, Us Government Report Finds-TeluguStop.com

దీనికి తోడు జనవరి 6 నాటి క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడికి సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఆయన మెడకు మరో ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.ట్రంప్ హయాంలో పనిచేసిన 13 మంది సీనయర్ సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ మంగళవారం బాంబు పేల్చింది.65 పేజీల నివేదికలో యూఎస్ ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సెల్ (ఓఎస్‌సీ) 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్.జారెడ్ కుష్నర్, కెల్లియన్నే కాన్వేతో సహా మిగిలిన సలహాదారులంతా తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది.అయితే ఈ నివేదికపై ట్రంప్ అధికార ప్రతినిధులు ఎలాంటి స్పందనా చేయలేదు.

ఓఎస్‌సీ అనేది యూఎస్ ప్రభుత్వంలోని ఒక స్వతంత్ర ఫెడరల్ వాచ్‌డాగ్.ఇది హాచ్ చట్టం యొక్క ఉల్లంఘనలను పరిశోధిస్తుంది.2020 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ను వైట్‌హౌస్‌లో నిర్వహించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ఓఎస్‌సీ తేల్చింది.ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక అధికారులుగా వున్న ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్, మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, మాజీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చాడ్ వోల్ఫ్‌లు హాచ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఓఎస్‌సీ ఆరోపిస్తోంది.

ఇక అంతకుముందు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి షాకిచ్చిన సంగతి తెలిసిందే.యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌పై ఈ ఏడాది జనవరి 6న జరిగిన హింసకు సంబంధించిన వైట్‌హౌస్ రికార్డులను కాంగ్రెస్ ఇన్వెస్టిగేటర్లకు అప్పగించొద్దంటూ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే.దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, ట్రంప్ సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర వుందని అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Jared, Presssecretary, Trumpadvisers, Finds, Whitestaff-Telugu NRI

తీర్పు సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ మాట్లాడుతూ.ట్రంప్ మద్ధతుదారులు చేసిన హింసాత్మక తిరుగుబాటుకు సంబంధించి రికార్డులను పొందేందుకు కాంగ్రెస్‌కు బలమైన ప్రజామద్ధతు వుందని వ్యాఖ్యానించారు.దాడికి సంబంధించిన పత్రాలను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు లేదా నిలిపివేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌కు అధికారం వుందని జడ్జి అన్నారు.అయితే ట్రంప్ తరపు న్యాయవాదులు మాత్రం వెనక్కి తగ్గేదే లే అన్నట్లుగా కొలంబియా సర్య్కూట్ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు.

అయితే చివరికి ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube