'హెచ్ – 4' EAD రద్దు - మరో మూడు నెలలు మాత్రమే  

‘హెచ్ – 4’ Ead రద్దు – మరో మూడు నెలలు మాత్రమే-

ట్రంప్ సర్కార్ ఎన్నారైల పై మరో పిడుగు లాంటి వార్త పేల్చింది.రానున్న మూడు నెలల కాల వ్యవధిలోనే హెచ్-4 వర్క్ పర్మిట్ రద్దు చేయనున్నట్లు ఫెడరల్ కోర్టుకు ట్రంప్ సర్కార్ నివేదికని పంపింది దాంతో ఒక్క సారిగా ఎన్నారైలకి టెన్షన్ పట్టుకుంది ముఖ్యంగా భారతీయ ఎన్నారైలకి ఈ వార్త ఎంతో కంగారుని పెట్టిస్తోంది.విదేశాల నుంచి అమెరికాకు హెచ్-1బీ వీసా దారుల భర్తలు కానీ భార్యలు కానీ ఎక్కువగా హెచ్-4 వర్క్ పర్మిట్ వీసాలు కలిగి ఉంటారు.దాంతో వీరందరూ ఎంతో కంగారు పడుతున్నారు..

‘హెచ్ – 4’ Ead రద్దు – మరో మూడు నెలలు మాత్రమే--Trump Administration Tells Court Decision To Revoke Work Permits H4-

ఈరోజు అంటే శనివారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని కోర్టులో అమెరికా హోమ్‌శాఖ ఈ పిటిషన్ దాఖలు చేసింది.హెచ్-4 వర్క్ పర్మిట్ లను రద్దు చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైందని మూడునెలల సమయంలో ఇది పూర్తి అవుతుందని కోర్టుకు హోమ్‌శాఖ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలను వైట్ హౌజ్‌లోని బడ్జెట్ నిర్వహణ కార్యాలయానికి మరో మూడునెలల సమయంలో అందిస్తామని స్పష్టం చేసింది.

సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ హెచ్-4 వర్క్ పర్మిట్ లను రద్దు చేయాలంటూ కోర్టును అభ్యర్ధించిన విషయం విదితమే అయితే ఈ మేరకు వారికి హోంశాఖ ఈమేరకు వివరణ ఇచ్చింది.ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచాలని కోరింది.

ట్రంప్ వచ్చాక హెచ్-4 వీసాదారులకు పని పరిమితులు రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు బహిరంగంగానే ప్రకటించింది కూడా.ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపింది.ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారతీయులపైనే ప్రభావం ఎక్కువగా చూపనుంది.