విదేశీ విద్యార్ధులకు ఊరట: అన్ని వైపులా ఒత్తిడితో వెనక్కి తగ్గిన ట్రంప్  

us president Donald Trump, rescinded a rule, international students leave the country,Trump Govt, NRI Students -

వ్యక్తిగతంగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా క్లాసులకు హాజరయ్యే విదేశీ విద్యార్ధులు అమెరికా విడిచి వెళ్లాలంటూ గత నెలలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి.ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, నిపుణుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

 Trump Administration Rescinds Rule Foreign Students

దీనికి తోడు దేశంలోని 17 రాష్ట్రాలు న్యాయపోరాటానికి సైతం దిగాయి.

అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఆ వివాదాస్పద నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు.

విదేశీ విద్యార్ధులకు ఊరట: అన్ని వైపులా ఒత్తిడితో వెనక్కి తగ్గిన ట్రంప్-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఐసీఈ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేశారు.ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.తద్వారా లక్షలాది మంది విదేశీ విద్యార్ధులకు ఊరట లభించింది.

కాగా, విదేశీ విద్యార్ధులను వెనక్కి పంపాలన్న ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో మొత్తం ఎనిమిది పిటిషన్లు దాఖలయ్యాయి.సుమారు 200 పైగా విద్యాసంస్థలు వీటిపై సంతకాలు చేశాయి.వీటికి గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు సైతం మద్ధతుగా నిలిచాయి.

మరోవైపు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్ధులు అమెరికా విడిచి వెళ్లాలని జూలై 6న ఐసీఈ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఒకవేళ తమ దేశంలో ఉండాలనుకుంటే క్యాంపస్‌లోనే విద్యాబోధన అందించే విద్యాసంస్థలకు మారాలని సూచించింది.

ఈ నిర్ణయంతో లక్షలాది మంది విదేశీ విద్యార్ధులు తమ భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trump Administration Rescinds Rule Foreign Students Related Telugu News,Photos/Pics,Images..