హెచ్ 1 బీ వీసా: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ మరో షాక్  

Trump admin proposes to scrap computerised lottery system to select H-1B visas, H-1B visas,US, Donald Trump, Visa Renewal, computerised lottery system ,Trump administration - Telugu Computerised Lottery System, Donald Trump, H-1b Visas, Trump Admin Proposes To Scrap Computerised Lottery System To Select H-1b Visas, Trump Administration, Us, Visa Renewal

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానికులను ప్రసన్నం చేసుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగం మరో నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది.హెచ్ 1 బీ వీసాల జారీకి సంబంధించి ప్రస్తుతం అమల్లో వున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేయాలని ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రతిపాదన తీసుకొచ్చింది.దీనిపై ప్రజల స్పందన తెలియజేసేందుకు వీలుగా ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది.30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయొచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వెల్లడించింది.అమెరికా సంస్థల్లో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగం చేసేందుకు హెచ్ 1 బీ వీసా వీలు కల్పిస్తుంది.ఇందుకోసం ప్రతి ఏటా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.

TeluguStop.com - Trump Administration H1 B Visa Computerized Lottery 1

వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65 వేల దరఖాస్తులను ఎంపిక చేసి హెచ్ 1 బీ వీసాను జారీ చేస్తారు అధికారులు.ఈ విధానం వల్ల అమెరికా కంపెనీలు తక్కువ వేతనానికే నిపుణులైన విదేశీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుండటంతో స్థానికులకు అవకాశాలు లభించడం లేదని ట్రంప్ తొలి నుంచి వాదిస్తున్నారు.2016 లో అమెరికా ఫస్ట్ నినాదంతోనే అధికారంలోకి వచ్చిన ఆయన… నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానంలో కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు.

లాటరీ పద్ధతిని రద్దు చేస్తూ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.

TeluguStop.com - హెచ్ 1 బీ వీసా: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ మరో షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇకపై అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) గరిష్ట వేతన స్థాయి ఆధారంగా హెచ్ 1 బీ వీసాలు జారీ చేయనుంది.అంటే ఇక నుంచి అత్యధిక వేతనాలు లభించే, అధిక నైపుణ్యం గల ఉద్యోగులకు మాత్రమే పెద్ద పీట వేస్తూ వీసాల జారీ ప్రక్రియను చేపట్టనున్నారు.

దీని వల్ల ప్రతిభ గల వారు మాత్రమే అమెరికాకు వచ్చే వీలుంటుదని, అంతేగాక స్థానికులకు సైతం ఉద్యోగ భద్రత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే వీసాల రెన్యువల్‌తో పాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుతమున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అమెరికాలో స్థిరపడిన, స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ట్రంప్‌ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అక్కడి కంపెనీలకు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తాజా ఉత్తర్వుల వల్ల భారీ నష్టం జరగనుందని చెబుతున్నారు.ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలకు కూడా ఈ ఉత్తర్వులు గండి కొడతాయని అంటున్నారు.

ఈ షాక్ నుంచి తేరుకునేలోపే మళ్లీ లాటరీ విధానంపై ట్రంప్ కత్తి కట్టడంతో విదేశీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#Visa Renewal #H-1B Visas #Donald Trump #TrumpAdmin

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trump Administration H1 B Visa Computerized Lottery 1 Related Telugu News,Photos/Pics,Images..