'షట్ డౌన్'... పై తాత్కాలిక ఒప్పందం.

ఆర్ధిక మాంద్యంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభింప కుండా ఉండటానికి అమెరికన్ కాంగ్రెస్ తాత్కాలిక ఒప్పందాన్ని ప్రకటించింది.ఆర్ధిక సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు లేకుండా ఉండే పరిస్థితి రానువ్వకూడదని ఈ నిర్ణయం తీసుకుంది.

 Trump About Shutdown In America-TeluguStop.com

అయితే సరిహద్దు గోడ నిర్మాణానికి ట్రంప్ అడిగిన 600కోట్ల డాలర్ల మొత్తాన్ని ఈ ఒప్పందంలో అనుమతి ఇవ్వకపోయినా సరే ఇమ్మిగ్రేషన్ నియంత్రాలని బలోపేతం చేస్తారని ఆసిస్తూ రిపబ్లికన్ల కి కొన్ని రాయితీలు ఇచ్చేందుకు అనుమతించనుంది.ఇమ్మిగ్రెంట్ల నిర్బంధాలను పరిమితం చేయాలన్న డెమొక్రాట్ల డిమాండ్ల పై చర్చలకు ముందుగానే కాంగ్రెస్‌ సభ్యులు రిపబ్లికన్లతో రాజీకి వచ్చారు.

600 కోట్ల డాలర్ల వ్యయంతో దాదాపు 200మైళ్ళ పొడవున ట్రంప్ వేయాలని అనుకున్న ఉక్కు కంచె నిర్మాణానికి బదులుగా 137.5కోట్ల డాలర్ల వ్యయంతో 55మైళ్ళ వరకూ సాధారణ తరహా కంచె వేయడానికి కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదం తెలిపారు.దాంతో తాత్కాలికంగా ఈ షట్ డౌన్ ఓ కొలిక్కి వచ్చినట్టే అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube