ట్రంప్ పై అభిశంసనకి పట్టు..!!!  

Senator Elizabeth Warren Warns Donald Trump-court,judge,president,telugu Nri Updates,trump,అభిశంసనకి పట్టు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై రోజుకో ఆరోపణలు , నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా అయ్యింది మొదలు ఎదోఒక విమర్శ ఎదుర్కుంటూనే ఉన్నారు. 2016 ఎన్నికల్లో అధ్యక్ష పోటీ సమయంలో ట్రంప్ ప్రచార తీరుపై ఎన్నో విమర్సలు వచ్చిన నేపధ్యంలో..

ట్రంప్ పై అభిశంసనకి పట్టు..!!!-Senator Elizabeth Warren Warns Donald Trump

తాజాగా ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ మ్యూలర్‌ నివేదిక తీవ్రంగా తప్పుపట్టినందున ట్రంప్ పై అభిశంసన తీర్మానం తీసుకురావాలని సెనెటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌ హెచ్చరించారు.

అటార్నీ విలియమ్ బార్ ఆ నివేదికలో, ట్రంప్‌పై చేసిన తీవ్ర విమర్సలకి సంభందించిన భాగాలని అమెరికన్ కాంగ్రెస్ ముందు ఉంచేందుకు సిద్దంగా ఉన్నారని వారెన్ తెలిపారు. ట్రంప్ దుష్ప్రవర్తన తీవ్రత దృష్ట్యా పార్టీలకి అతీతంగా అభిశంసన కు అందరూ సహకరించాలని ఆయన కోరారు.