ఇదేం సుడిగాలిరా నాయ‌నా.. ఏకంగా ట్ర‌క్కునే ఎత్తిప‌డేసిందిగా..

ప్రజెంట్ డిజిటల్ వరల్డ్‌లో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది.ప్రపంచంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా అది క్షణాల్లోనే అందరికీ రీచ్ అవుతున్నది.

 Truck Gets Turned On Its Side Amid Tornado-TeluguStop.com

ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా ద్వారా లైవ్ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు.కాగా తాజాగా భయంకర సుడిగాలికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది ఎంతటి భయంకరమైన సుడిగాలి అంటే.ఏకంగా ట్రక్కును ఎత్తుపడేసింది ఈ గాలి.

 Truck Gets Turned On Its Side Amid Tornado-ఇదేం సుడిగాలిరా నాయ‌నా.. ఏకంగా ట్ర‌క్కునే ఎత్తిప‌డేసిందిగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా బాగా వైరలవుతోంది.

సుడిగాలులు సాధారణంగా బలమైన గాలులు, వర్షంతో వస్తుంటాయి.

అయితే, హాలీవుడ్ సినిమాల్లో ఈ సుడిగాలుల వల్ల సంభవించే ప్రకృతి వైపరిత్యాలను మనం ఎక్కువగా చూడొచ్చు.మన దేశంలో కొంత తక్కువే.

అయితే, ఈ హాలీవుడ్ సినిమాల్లో చూపించే సుడిగాలుల వల్ల జంతువులు, చెట్లు కొట్టుకుపోవడం బ్రిడ్జిలు కూలిపోవడంతో పాటు మానవాళి మొత్తం అల్లకల్లోలం కావడం మనం గమనించొచ్చు.అటువంటి ఘటనలు రియల్ లైఫ్‌లో జరుగుతాయా?అనే అనుమానాలు సైతం మనకు రావచ్చు.కానీ, తాజాగా వైరలవుతున్న భయంకరమైన రాక్షస సుడిగాలిని బట్టి అటువంటి సుడిగాలులు సంభవించొచ్చనే నిర్ధారణకు మనం ఈజీగా రావచ్చు.ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియాలో సంభవించిన సుడిగాలికి సంబంధించిన వీడియో ఇది.కాగా, అత్యంత వేగంగా గాలి వీచింది.సుడిగాలి వచ్చిన సమయంలో గాలి వేగం దాదాపు 130 ఎంపీహెచ్ ఉందట.

ఈ ఘటన అంతా ట్రక్కు డ్యాష్ బోర్డులోని కెమెరాలో క్లియర్‌గా రికార్డు కాగా, అది బోల్తా పడే సీన్ కూడా రికార్డు అయింది.ట్రక్కు బోల్తా పడుతున్న సమయంలో ట్రక్కులో డ్రైవర్, క్లీనర్, ప్రయాణికులు ఉన్నారు.

వారికి చిన్న, చిన్న గాయాలు కాగా, ప్రమాదమేమీ సంభవించలేదు.ఈ వీడియో చూసి నెటిజన్లు జనాలు అప్రమత్తంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

తుపాను హెచ్చరికలను జనం సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

#Truck #Tornado #Whirlwind #Tornado #Pennsylvania

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు