కొత్త వాహన చట్టాలతో అల్లాడుతున్న ప్రజలు,లారీ డ్రైవర్ కు భారీ ఫైన్

కొత్త వాహన చట్టాలు అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాలతో బయటకు రావాలి అంటేనే ప్రజలు భయపడుతున్నారు.ఎప్పుడు ఏ పేరు తో ఫైన్ విధిస్తారో అంటూ అందరూ బిక్కు బిక్కు మంటూ రోడ్లపైకి వస్తున్నారు.

 Truck Driver Got Huge Fine For The Overloading Peoples-TeluguStop.com

మొన్నటికి మొన్న బైక్ పత్రాలు లేవని ఫైన్ విధించడం తో అతడు ఏకంగా బైక్ నే తగలబెట్టుకున్న ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఒక లారీ డ్రైవర్ కు 2 లక్షల రూపాయల మేరకు భారీ ఫైన్ విధించడం విశేషం.

దీనితో దేశంలో ఇప్పటివరకూ పడిన అత్యధిక ఛలానాగా ఈ మొత్తం రికార్డుల్లోకి ఎక్కింది.అంతేనా.

ఈ లారీ డ్రైవర్ రామ్ కిషన్ ను అరెస్ట్ కూడా చేశారు పోలీసులు.అయితే ఇంతకీ ఇంత భారీ మొత్తంలో ఫైన్ ఎందుకు విధించారు అంటే పరిమితికి మించిన సామాన్లను లారీలో తీసుకెళ్లటం వల్ల ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించినట్లు తెలుస్తుంది.

లారీలో నిర్దేశించిన బరువుకు మించి సామాన్లను తీసుకెళితే ప్రతి అదనపు టన్నుకు రూ.2వేలు జరిమానా విధించాల్సి వస్తుంది.ఈ లెక్కన రూ.2.05 లక్షల చలానా విధించారు.దీనిని బట్టి నిబంధనల ఉల్లంఘన ఎంత భారీగా ఉందొ అన్న విషయం అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube